Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
TG News : తెలంగాణలో దోపిడీ ముఠా? నిప్పులు చెరిగిన కేటీఆర్
State

TG News : తెలంగాణలో దోపిడీ ముఠా? నిప్పులు చెరిగిన కేటీఆర్

ఆ ఆరుగురిని దోపిడీ ముఠాగా పేర్కొన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి ఆరుగురు ముఠా సభ్యులను ఏర్పాటు చేసి రాష్ట్రంలో తిప్పుతున్నాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కేటీఆర్ TG News : తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి, అధికార పక్షం, ప్రతిపక్షం, ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాసేపటి క్రితం కేటీఆర్ (KTR) చేసిన ఆరోపణలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రేవంత్ సోదరులతోపాటు మరో నలుగురిని అలీబాబా అరడజన్ దొంగలతో కేటీఆర్ పోల్చడం హాట్ టాపిక్ గా మారింది. మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన కేటీఆర్ రాష్ట్రంలో ఆరుగురు కూడిన దొంగల ముఠా తిరుగుతోందని, రాష్ట్రంలో ఉన్న కంపెనీలల్లో వసూళ్లు చేయడం కోసమే రేవంత్ రెడ్డి ఈ ముఠాను ఏర్పాటు చేసాడని అన్నారు. ఈ ముఠా కంపెనీల్లో వసూళ్లు చేయడమే కాకుండా కబ్జాలతో పాటు, బ్లాక్ మెయిల్ లకు పాల్పడుతోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సోదరులైన తిరుపతిరెడ్డి, కొండల్...
Union Budget 2025 : 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
National

Union Budget 2025 : 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

Parliament Budget Session | పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలకు రంగం సిద్దమవుతోంది. ఈ నెల 31 నుంచి సమావేశాలు (Union Budget 2025) ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 31న పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ నాలుగో తేదీన ముగుస్తాయి. తొలి విడత సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు, మలి విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్‌ నాలుగో తేదీ వరకు కొనసాగనున్నాయి. Union Budget 2025 Expectations Live Updates : సాధారణ మధ్య తరగతి ప్రజల టెక్, హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ వర్గాల వరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే ఎనిమిదో బడ్జెట్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా...
CM Revanth Reddy : సింగ‌పూర్ విదేశాంగ మంత్రితో సీఎం రేవంత్ భేటీ
State

CM Revanth Reddy : సింగ‌పూర్ విదేశాంగ మంత్రితో సీఎం రేవంత్ భేటీ

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశాల‌కు ప‌య‌న‌మ‌య్యారు. త‌న స‌హ‌చ‌ర మంత్రుల‌తో క‌లిసి సింగ‌పూర్‌, దావోస్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరారు. ముందుగా ఈ రోజు సీఎం రేవంత్‌రెడ్డి ప‌ర్య‌ట‌న సింగపూర్ (Singapore)లో సాగింది. ఆ దేశ విదేశాంగ మంత్రి డాక్ట‌ర్ వివియన్ బాలకృష్ణన్ (Vivian Balakrishnan)ను ఆయ‌న క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వీరి మ‌ధ్య ప‌లు అంశాల‌పై చ‌ర్చ జ‌రిగింది. తెలంగాణ‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ వంటి పర్యావరణ అనుకూల కార్యక్రమాలు, నీటి నిర్వహణ, నదుల పునరుజ్జీవన కార్యక్రమాలు, ప‌ర్యాటక రంగ అభివృద్ధి, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఐటీ పార్కుల అభివృద్ధికి పెట్టుబ‌డులు, వ‌న‌రుల‌పై ఈ స‌మావేశంలో సుదీర్ఘంగా చ‌ర్చించారు. విస్తృత చర్చలు జ‌రిపాం: సీఎం రేవంత్‌ సింగ‌పూర్ విదేశాంగ మంత్రి (Foreign Affairs Minister of Singapore) వివియన్ బాలకృష్ణన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి మ‌...
RTA Corruptions : లంచం కొట్టు లైసెన్స్ పట్టు..?
Special Stories

RTA Corruptions : లంచం కొట్టు లైసెన్స్ పట్టు..?

"అలీ" వ్యూహంతో వసూళ్ల జాతరలో చిందులేస్తున్న మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు..? నిబంధనలకు పాతర.. వసూళ్ల జాతర.. బరితెగించిన ఎంవీఐ లు… ?చేతులెత్తేసిన ఉన్నతాధికారి ..? ఏసీబీ నజర్ వేస్తే తప్ప వసూళ్లు ఆగేలా లేవట.. RTA Corruptions : రండి బాబు.. రండి మాకు కావాల్సింది సమర్పించుకోండి మీ పనులను సులువుగా చేసుకోండి. మా దగ్గర నిబంధనలతో పని ఉండదు అడిగేవారు అసలే లేరు. మీకు లర్నింగ్ లైసెన్స్ కావాలా? పర్మినెంట్ లైసెన్స్ కావాలా? ఇంకేమైనా సేవలు కావాలా మా ప్రైవేట్ అసిస్టెంట్ ని కలవండి ఈజీగా లైసెన్స్ పొందండి అనే రీతిలో హన్మకొండ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు వ్యవహరిస్తున్నారని జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో వసూళ్ల జాతర నడుస్తోందట, ఆ కార్యాలయంలో రవాణా శాఖ నిబంధనలు పాతరేసి వసూళ్ల జాతరలో ఎంవీఐ లు నిమగ్నమయ్యారని విశ్వసనీయంగా తెలుస్తోంది. RTA Corruptions : ల...
Vijay Sethupathi : మక్కల్ సెల్వన్ కొత్త సినిమా గ్లింప్స్
Cinema

Vijay Sethupathi : మక్కల్ సెల్వన్ కొత్త సినిమా గ్లింప్స్

Kollywood : మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ( Vijay Sethupathi ) ఏ క్యారెక్టర్ చేసినా అందులో ఇన్వాల్ అయిపోతారు. ఒక సినిమాలో తండ్రి పాత్రలో మెప్పించగలడు.. అలాగే విలన్ పాత్రలో అలరించగలడు.. అలాగే హీరోగా లుక్ మార్చుకొని ఇరగోట్టగలడు. ఎటువంటి పాత్రనైనా చేసి ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడు. ఆయన తాజా చిత్రం ఏస్ (Ace) గ్లింప్స్ ను తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. అరుముగా కుమార్ ( Arumuga kumar) డైరెక్షన్లో సెవెన్ సీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు మాస్ ఎలివేషన్స్ తో చాలా ఎంటర్టైన్మెంట్ గా ఈ మూవీ ఉండబోతుందని గ్లింమ్స్ చూస్తే అర్థమవుతుంది. రుక్మిణి వసంత్, యోగిబాబు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మహారాజ తర్వాత వస్తున్న మూవీ కావడంతో విజయ్ సేతుపతి ఖాతాలో మరో హిట్టు చేరుతుందని ఆడియన్స్ అనుకుంటున్నారు. గ్లింప్స్ లో ఆయన స్టైలిష్ లుక్ ...
error: Content is protected !!