Manmohan Singh | ఆర్థిక వ్యవస్థకు ప్రాణం పోసిన ‘డాక్టర్’
Manmohan Singh : మన్మోహన్ సింగ్.. మృదు స్వభావి. నోట్లో నాలుక ఉండదన్నట్టే కనిపించిన ఆయన ఓ నిశ్శబ్ద విప్లవం. రెండు సార్లు ప్రధానిగా ప్రాతినిధ్యం వహించిన మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ఆర్థికవేత్తగా తనకున్న అనుభవంతో అనేక సంస్కరణలను తీసుకొచ్చారు. ఆర్థిక మాద్యమాన్ని గాడిలో పెట్టి దేశానికి కొత్త దిశ చూపారు. మన్మోహన్ సింగ్ (92) మృతి చెందారనే వార్త భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయామనే విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆర్థికరంగ డాక్టర్.. Manmohan Singh
ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో 1932లో జన్మించిన మన్మోహన్ సింగ్ ఉన్నత విద్యను అభ్యసించారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినప్పటికీ పంజాబ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తయ్యాక కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ పూర్తిచేశారు. అనంతరం ఆర్థిక శాస్త్రం...




