Formula E race case | రేవంత్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్..!
Formula E race case : 'ఫార్ములా ఈ' రేసు కేసులో తనపై చర్యలు తీసుకోవడానికి అవినీతి నిరోధక విభాగానికి (ACB) అనుమతినిస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొనేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'X' ద్వారా ఆయన మంగళవారం తీవ్రంగా ప్రతిస్పందించారు.
కేటీఆర్ ఏమన్నారంటే..
తనపై ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి 'చిట్టి నాయుడు' అంటూ కేటీఆర్ సంభోదించారు. 'ఢిల్లీలో బీజేపీతో చేసుకున్న ఒప్పందాల ఫలితాలు కనిపిస్తున్నాయి' అని కూడా వ్యాఖ్యానించారు. ఢిల్లీకి రేవంత్‌రెడ్డి 30 సార్లు వెళ్లి రాష్ట్రానికి కొన్ని నిధులైనా తెచ్చుకోలేకపోయారని, తనపై మాత్రం మూడు కేసులు పెట్టడం ద్వారా రాజకీయంగా ప్రయోజనాలు పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ కేసు...




