Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Devendra Fadnavis | మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. రేపే ఏకగ్రీవ ఎన్నిక
National

Devendra Fadnavis | మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. రేపే ఏకగ్రీవ ఎన్నిక

Devendra Fadnavis | మహారాష్ట్రలో ముఖ్యమంత్రి విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు 12 రోజుల తర్వాత తెర‌ప‌డింది. ముంబైలో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం డిసెంబర్ 5న ఆయన మూడోసారి మహారాష్ట్ర సీఎం కానున్నారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఫడ్నవీస్ పాల్గొన్నారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా నిర్మ‌లా సీతారామన్, రూపానీని బిజెపి నియమించిన విష‌యం తెలిసిందే.. అయితే శాసనసభా పక్ష సమావేశానికి ముందు, బిజెపి నేత‌ సుధీర్ ముంగంటివార్ మాట్లాడుతూ, మహాయుతి మిత్రపక్షాలు బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలుస్తాయ‌ని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై చ‌ర్చిస్తామ‌ని తెలిపారు. మహారాష్ట్రలో నవంబర్ 20 న జ...
Earthquake | తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు .. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు
State

Earthquake | తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు .. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

  Breaking News | ఆంధ్ర‌ప్ర‌దేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో బుధవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు (Earthquake) సంభ‌వించాయి. దీంతో ఒక్క‌సారిగా ప్ర‌జ‌లంద‌రూ భయాందోళనలకు గురయ్యారు. తెలంగాణలో హైదరాబాద్‌, హనుమకొండ, వరంగల్‌, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం, ఇల్లందు పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని చెబుతున్నారు. బుధవారం ఉదయం 7:27 గంటలకు ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అలాగే మణుగూరు సబ్ డివిజన్, మహబూబాబాద్ జిల్లా గంగారం, కరీంనగర్‌ విద్యానగర్‌లో భూకంపం కార‌ణంగా నిలబడిన ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్టు స్థానికులు పేర్కొంటున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, సుల్తానాబాద్, కరీంనగర్, హుజురాబాద్‌లో సైతం స్వల్పంగా భూప్రకంపనలు న‌మోద‌య్యాయి.గ్రేటర్ హైద...
Andhra Pradesh | సిఐడి మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్..
Crime

Andhra Pradesh | సిఐడి మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్..

విజయవాడ దాటొద్దని సంజయ్ కు ఆదేశాలు టెండర్లు పిలవకుండానే ఎలక్ట్రానిక్ వస్తువులు(ల్యాప్ టాప్, ఐపాడ్) కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ? అగ్నిమాపక శాఖ "డీజీ"గా విధులు నిర్వహించినప్పుడు నిధుల దుర్వినియోగం చేసినట్లు ప్రచారం Andhra Pradesh | సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆ అధికారిని సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సదరు అధికారి అగ్నిమాపక శాఖ "డీజి"గా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం తో పాటు నిధులను కూడా తన ఇష్టానుసారంగా ఎలాంటి టెండర్లు లేకుండానే ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐడి మాజీ చీఫ్ సంజయ్ విచారణ పూర్తి అయ్యేంతవరకు విజయవాడ వదలి వెళ్లకూడదని ఆయనకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. టెండర్లు లేకుండా ల్యాప్...
Build Now | బిల్డ్ ‌నౌ యాప్ తో భ‌వ‌నాలు, లేఔట్ల అనుమ‌తులు ఈజీ..
State

Build Now | బిల్డ్ ‌నౌ యాప్ తో భ‌వ‌నాలు, లేఔట్ల అనుమ‌తులు ఈజీ..

Build Now | భవనాలు, లేఅవుట్ల అనుమతులకు ‘బిల్డ్ ‌నౌ’ పేరుతో కొత్త ఆన్‌లైన్‌ ‌విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ’బిల్డ్ ‌నౌ’ పేరుతో రూపొందించిన యాప్‌తో పాటు, ఆన్‌లైన్‌ విధానాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు మంగళవారం ప్రారంభించారు. సచివాలయంలో బిల్ట్‌ ‌నౌ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పట్టణాభివృద్ధిలో గతంలో లేని విధంగా అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌ ‌బాబు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 60 శాతం మంది జనాభా పట్టణ, నగర ప్రాంతాల్లో ఉంటున్నార‌ని అందుకే ఈ శాఖను సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారన్నారు. రాష్ట్రంలో వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పిస్తున్నామ‌ని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి విధానాలను కొనసాగిస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కోక్కటిగా నెరవేరుస్తున్నామ‌ని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పథకా...
Eknath Shinde | ఏక్ నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం ప‌ద‌వి?
National

Eknath Shinde | ఏక్ నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం ప‌ద‌వి?

Eknath Shinde | మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీసే ఖాయంగా తెలిసింది. ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్‌ షిండే (Eknath Shinde).. డిప్యూటీ సీఎంగా (Deputy Chief Minister) బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. మ‌హారాష్ట్ర‌లో డిసెంబర్ 5న కొత్త సీఎం ప్ర‌మాణ స్వీకారం చేయనున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, కేబినెట్‌ కూర్పు ఇంకా పూర్తి కాని కారణంగా.. ఆ రోజు సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలు మాత్రమే ప్రమాణం చేస్తారని సదరు వర్గాలు తెలిపాయి. ముఖ్య‌మంత్రిగా ఫడ్నవీస్‌, డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్‌ షిండే, అజిత్‌ పవార్‌లు ప్రమాణ స్వీకారం చేయ‌నున్నార‌ని జాతీయ మీడియా పేర్కొంటోంది. ఇదిలా ఉండ‌గా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి (Mahayuti) రికార్డు స్థాయిలో సీట్ల‌నుగెలుచుకొని భారీ విజ‌యాన్ని కైవ‌సం చే...
error: Content is protected !!