Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Weather updates | తెలుగు రాష్ట్రాల్లో ఫెంగ‌ల్ తుఫాన్ ప్ర‌భావం.. కొన‌సాగుతున్న వ‌ర్షాలు..
State

Weather updates | తెలుగు రాష్ట్రాల్లో ఫెంగ‌ల్ తుఫాన్ ప్ర‌భావం.. కొన‌సాగుతున్న వ‌ర్షాలు..

Weather updates : తీవ్ర‌మైన‌ఫెంగల్ తుపాను తీరం దాటినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ప‌లుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మ‌రోవైపు చలి తీవ్రత కూడా తగ్గింది. ఏపీతోపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా వాన‌లు పడుతున్నాయి. ఈ రోజు వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో .. Telangana Weather updates : తెలంగాణలో ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో చెదురుమదురు వాన‌లు కూరిసే అవ‌కాశం ఉంద‌ని అధికారులు తెలిపారు. ఏడో తేదీ వరకు ఇలాంటి వాతావరణం ఉంటుందని చెబుతోంది. ఈనెల 8 నుంచి వాతావరణంలో మార్పులు వొస్తాయని వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగానే నమోదవుతాయ చెప్పింది. ఇక తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. మెదక్‌లో అత్యల్పంగా 16.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది,. నిజామాబాద్‌ జిల్లాలో 32...
Gold price today : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
Business

Gold price today : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold price today : హైదరాబాద్​, వైజాగ్​​, విజయవాడ​ సహా ఇతర ప్రదేశాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.. హైదరాబాద్​లో డిసెంబ‌ర్ 2న మంగ‌ళ‌వారం 10 గ్రాముల బంగారం (22క్యారెట్లు) ధర రూ. 71,519గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 78,019 ట్రేడ్ అవుతోంది. ఇక‌ కిలో వెండి ధర రూ. 1,03,200గా ఉంది. విజయవాడ లో 10 గ్రాముల పుత్త‌డి ధ‌ర‌ (22క్యారెట్లు) రూ. 71,525 ప‌లుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ​ రూ. 78,025గా ఉండ‌గా, వెండి కేజీ ధర రూ. 1,04,000గా ఉంది. ఇక విశాఖపట్నంలోనూ దాదాపు ఇవే ధ‌ర‌లు కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధర రూ.71,527 ప‌లుకుతోంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 78,027 గా ఉంది. ఇక 100 గ్రాముల వెండి​ ధర‌ రూ. 10,160 ఉంది. వరంగల్​లో 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 71,519- రూ. 78,019గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 10,320 ప‌లుకుతోంది...
Aramghar to Zoo Park Flyover | భాగ్యనగరంలో ఆరు లైన్ల‌ భారీ ఫ్లైఓవర్‌
State

Aramghar to Zoo Park Flyover | భాగ్యనగరంలో ఆరు లైన్ల‌ భారీ ఫ్లైఓవర్‌

‌నెహ్రూ జులాజికల్‌ ‌పార్క్ ‌నుంచి అరాంఘర్ ఫ్లైఓవ‌ర్‌ Aramghar to Zoo Park Flyover | నిత్యం ట్రాఫిక్‌ ‌కష్టాలలో ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..  నెహ్రూ జులాజికల్‌ ‌పార్క్ ‌నుంచి అరాంఘర్‌ ‌సిక్స్ ‌లేన్‌ ‌ఫ్లైఓవర్‌ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు పట్టాలెక్కబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి చేతుల మీదుగా ఈ భారీ ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. ఇది హైదరాబాద్ లోనే అతిపెద్ద రెండో ఫ్లైఓవర్‌. 24 ‌మీటర్ల వెడల్పు, నాలుగు కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ. 636 కోట్ల ఖర్చు చేశారు.  ఫ్లైఓవర్‌కు రెండువైపులా ఎనిమిది కిలోమీటర్ల సర్వీస్‌ ‌రోడ్డు పూర్తి చేయడమే ప్రాజెక్టులో అతి పెద్ద సవాల్‌. ఈ రోడ్ల‌కు అడ్డుగా ఉన్న నిర్మాణాలను కూల్చివేసి సర్వీస్‌ ‌రోడ్‌ను చకచకా నిర్మిస్తున్నారు.ఫ్లైఓవర్‌ ‌పనులు దాదాపుగా 90 శాతం పూర్తయ్యాయి. హెచ్‌ఎం‌డీఏ ఉన్నతాధికారులతో ...
Telugu University | బాచుప‌ల్లిలో తెలుగు యూనివ‌ర్సిటీ కొత్త క్యాంప‌స్ ప్రారంభం
State

Telugu University | బాచుప‌ల్లిలో తెలుగు యూనివ‌ర్సిటీ కొత్త క్యాంప‌స్ ప్రారంభం

Hyderabad | హైద‌రాబాద్‌ బాచుపల్లిలో నిర్మించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (Telugu University) కొత్త క్యాంపస్ ను సోమవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. 100 ఎకరాల ప్రాంగణంలో  ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయ నిర్మాణానికి రూ.35 కోట్లు ఖర్చు చేశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం 39వ వ్యవస్థాపక‌ దినోత్సవాలను సైతం మంత్రి శ్రీధ‌ర్ బాబు ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయ విద్యార్థులకు కంప్యూటర్ల వినియోగంలో 100 కంప్యూటర్లను కేటాయించనున్నట్టు హామీ ఇచ్చారు. విద్యార్థులు డిగ్రీలు పూర్తిచేసుకునే లోగా వారికి ఇష్టమైన రంగంలో నైపుణ్య శిక్షణ అందిస్తామ‌ని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపైనే సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోంద‌న్నారు. కృత్రిమ మేథలో విద్యార్థులు ప్రావీణ్యం సంపాదించుక...
Vikrant Massey | 12th Fail హీరో విక్రాంత్ షాకింగ్ నిర్ణ‌యం..
Cinema

Vikrant Massey | 12th Fail హీరో విక్రాంత్ షాకింగ్ నిర్ణ‌యం..

Vikrant Massey | 12th Fail మూవీతో దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విక్రాంత్‌ మాస్సే (Vikrant Massey) సంచలన నిర్ణ‌యం తీసుకున్నారు. కొంతకాలం సినిమాలకు బ్రేక్‌ ఇస్తున్నట్లు తాజాగా ప్ర‌క‌టించారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ నోట్‌ పెట్టారు. కొన్నేళ్లుగా అందరి నుంచి అసాధారమైన ప్రేమ, అభిమానాన్ని పొందుతున్నాన‌ని, చెప్పారు. ఇప్పటి వరకూ తనకు సహక‌రించిన అంద‌రికీ ధన్యవాదాలు తెలిపారు. ఓ తండ్రిగా, కొడుకుగా, భర్తగా బాధ్యతలు నెరవేర్చాల్సిన స‌మ‌యం వొచ్చిద‌ని అందుకే కొత్త సినిమాలను అంగీకరించడం లేదని పేర్కొన్నారు. ‘గత కొన్నేళ్లు అద్భుతంగా గడిచాయి. ఇంత‌కాలం నాపై ప్రేమ, అభిమానం చూపినవారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. ఇప్పుడు నా కుటుంబం కోసం సమయం వెచ్చించాల్సిన‌ టైమ్ వచ్చింది. 2025లో రిలీజ్ అయ్యే సినిమానే నా చివరి మూవీ’ అని విక్రాంత్ మాస్సే ప్రకటించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో అభిమానులతోపాటు సినీ ప్రియులు ఆశ్...
error: Content is protected !!