Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Heavy Rains | రేపు ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు
State, Hyderabad

Heavy Rains | రేపు ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

Hyderabad : తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చ‌రించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి ఉత్తర ఒడిశా దాని సమీపంలోని చత్తీస్‌గఢ్‌ల మీదుగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వివరించింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురువనున్నాయి. రుతుపవన ప్రభావంతో మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్‌ (Warangal) జిల్లాల్లో భారీ వానలు కురుస్తున్నాయి. ఇక బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్‌, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్‌, కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, మెదక్‌, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో అక్...
Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ మార్గాల్లో 22 ప్రత్యేక రైళ్లు..
State

Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ మార్గాల్లో 22 ప్రత్యేక రైళ్లు..

South Central Railway Special Trains | తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని నగరాలు, పట్టణాల నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లే ప్రజల కోసం దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు (Special Trains) నడపనున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు సెప్టెంబర్ 4 నుంచి 25వ తేదీ వరకు నడుస్తాయని తెలిపారు. ప్రత్యేక రైళ్లు నడిచే రూట్లు ఇవే.. సికింద్రాబాద్-తిరుపతి రూట్ సెప్టెంబర్ 4 నుంచి 25 వరకు సికింద్రాబాద్‌ -తిరుపతి మధ్య 4 ప్రత్యేక సర్వీసులు సెప్టెంబర్ 5 నుంచి 26 వరకు తిరుపతి -సికింద్రాబాద్ మధ్య 4 ప్రత్యేక సర్వీసులు కాచిగూడ - నాగర్‌సోల్ రూట్ సెప్టెంబర్ 4 నుంచి 25 వ...
Nizamabad : నిజామాబాద్‌లో జంట హత్యలతో కలకలం
Crime, Nizamabad

Nizamabad : నిజామాబాద్‌లో జంట హత్యలతో కలకలం

Nizamabad : నిజామాబాద్ జిల్లా (Nizamabad) మాక్లూరు మండలం ధర్మోరా(ఏ) గ్రామంలో జంట హత్యలు క‌ల‌క‌లం సృష్టించాయి. ఆదివారం రాత్రి నిజామాబాద్ లోని గౌతమ్ నగర్‌కు చెందిన జిలకర ప్రసాద్ తన స్నేహితుడితో కలిసి ధర్మోరాలో తనకు పరిచయం ఉన్న ఓ మహిళ ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ మహిళ బంధువులకు ప్రసాద్‌కు మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగి గొడ‌వ‌ పెద్దది కావడంతో ఒక‌రికొక‌రు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో జీలకర్ర ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా, అతడి స్నేహితుడు నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జంట హత్యలతో గ్రామం ఒక్క‌సారిగా షాక్ కు గురైంది. ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. దీంతో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఘటన అర్ధరాత్రి 2 గంటల సమయంలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు ప్రసాద్‌పై అనేక చోరీ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్యలకు వివాహేతర సంబంధమే కారణ...
Ragging | ర్యాగింగ్‌పై కఠిన చర్యలు : వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరిక
warangal, State

Ragging | ర్యాగింగ్‌పై కఠిన చర్యలు : వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరిక

Warangal News | విద్యాసంస్థల్లో ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్ (Ragging) వంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై చ‌ట్ట ప్ర‌కారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ (Warangal CP) స‌న్‌ప్రీత్ సింగ్‌ హెచ్చరించారు. త్వరలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోవుతున్న నేప‌థ్యంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ర్యాగింగ్‌ నియంత్రణపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్ ఆదివారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడడ‌మ‌నేది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని, ఈ చర్యల ద్వారా విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేలా ఉంటుంద‌ని అన్నారు. ముఖ్యంగా సీనియర్ల ముసుగులో జూనియర్‌ విద్యార్థుల పట్ల అసాంఘిక కృత్యాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తూ విద్యాసంస్థల నుంచి తొలగించడంతో పాటు ర్యాగింగ్‌ లాంటి చర్యలకు పాల్పడే విద్యార్థులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. ర్యాగింగ్‌ పా...
BRS Party | పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలి : కేటీఆర్ సవాల్
State, Hyderabad

BRS Party | పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలి : కేటీఆర్ సవాల్

Hyderabad | పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే వారి పదవులకు రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ (BRS Party ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. రేవంత్‌ రెడ్డి తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని చెప్పారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎన్నికలు వస్తే ఓటమి భయం పట్టుకుందని సెటైర్లు వేశారు. శేరిలింగంపల్లి (sharlingampalli) నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఓటువేసిన ప్రజలను నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని కేటీఆర్ కొనియాడారు. హైదరాబాద్​ లో కాంగ్రెస్ నేతల దందాల కోసమే హైడ్రా పనిచేస్తోందని ఆరోపించారు. హైడ్రా (Hydraa) కారణంగానే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనల...
error: Content is protected !!