Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
విద్య, వైద్యంపై వరాల జల్లు.. వ్యవసాయం, సాగునీటి రంగానికి నిధుల కోత!
Hyderabad

విద్య, వైద్యంపై వరాల జల్లు.. వ్యవసాయం, సాగునీటి రంగానికి నిధుల కోత!

హైదరాబాద్: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు మిశ్రమ ఫలితాలను చూపుతున్నాయి. ప్రభుత్వం విద్య, వైద్యం మరియు గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేయగా, కీలకమైన వ్యవసాయం, సాగునీటి రంగాల్లో నిధుల కోత విధించడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే పలు శాఖల కేటాయింపుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆశాజనకంగా విద్య, వైద్య రంగాల కేటాయింపులు సామాజిక మౌలిక సదుపాయాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యా శాఖ: గత ఏడాది ₹23,108 కోట్లు ఉండగా, ఈసారి దీనిని ఏకంగా ₹26,674 కోట్లకు పెంచారు. ఆరోగ్య శాఖ: వైద్య రంగానికి గతంలో కంటే సుమారు 1,300 కోట్లు అదనంగా కేటాయించి, మొత్తాన్ని ₹13,679 కోట్లకు చేర్చారు. గ్రామీణాభివృద్ధి: పంచాయతీ రాజ్ శాఖకు ఈసారి ₹33,688 కోట్లు కేటాయించగా, గత బడ్జెట్‌లో ఇది ₹31,605 కోట్లుగా ఉంది. వ్యవసాయం, సాగునీటి రంగాలకు నిరాశే.. అన్నదాతకు అ...
Paddy Scam | అరవింద రైస్ మిల్లులో ఫిజికల్ వెరిఫికేషన్ జరిగేనా
Special Stories

Paddy Scam | అరవింద రైస్ మిల్లులో ఫిజికల్ వెరిఫికేషన్ జరిగేనా

పౌరసరఫరాల రికార్డు లకు మిల్లులోని ధాన్యం నిల్వలకు భారీ వ్యత్యాసం .. Narsampet Aravinda Rice Mill Paddy Scam | నర్సంపేట పట్టణ శివారులోని అరవింద రైస్ మిల్లులో భారీ స్థాయిలో ధాన్యం నిల్వలు మాయమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రికార్డులకు, మిల్లులో ఉన్న వాస్తవ నిల్వలకు మధ్య పొంతన (Narsampet Paddy Stock Discrepancy) లేకపోవడంతో పెను దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే 'సర్కార్ లైవ్ (Sarkar Live)' కథనం ప్రచురించడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో మరికొన్ని గంటల్లోనే పౌరసరఫరాల శాఖ అధికారులు 'ఫిజికల్ వెరిఫికేషన్' (Physical Verification) చేస్తారని ప్రచారం జరుగుతోంది. ​Paddy Scam : అక్రమ విక్రయాల కలకలం.. తేడాలు ఎక్కడ? నర్సంపేట లోని అరవింద రైస్ మిల్ కు ​ప్రభుత్వం మిల్లింగ్ కోసం కేటాయించిన వేల క్వింటాళ్ల ధాన్యం లెక్కల్లో భారీగా వ్యత్యాసం ఉన్నట్లు సమాచారం. రికార్డుల ప్రకారం...
తెలంగాణ ఉద్యమకారుల ‘గోస’..కాంగ్రెస్ సర్కార్‌పైనే ఆశలు.. ‌‌– Telangana Agitators Welfare
Special Stories

తెలంగాణ ఉద్యమకారుల ‘గోస’..కాంగ్రెస్ సర్కార్‌పైనే ఆశలు.. ‌‌– Telangana Agitators Welfare

మంత్రి పొన్నం ప్రభాకర్‌పైనే భారం! Telangana Agitators Welfare : స్వరాష్ట్ర కల సాకారమై దశాబ్దం దాటినా, ఆ కల కోసం లాఠీ దెబ్బలు తిని, జైలు గోడల మధ్య నలిగిపోయిన సామాన్య ఉద్యమకారుల బతుకులు నేటికీ 'గోస' పడుతూనే ఉన్నాయి. పదవుల పంపకాలు పూర్తి కావడంతో పాలన గాడిలో పడింది కానీ, క్షేత్రస్థాయిలో పోరాడిన యోధుల సంక్షేమం మాత్రం ఇంకా హామీలకే పరిమితమైంది. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో మొండిచేయి ఎదురవ్వగా, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని ఉద్యమకారులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. బిఆర్ఎస్ హయాంలో అన్యాయం.. ఆవేదనలో ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమమే పునాదిగా అధికారంలోకి వచ్చిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ఉద్యమకారులను విస్మరించిందనే విమర్శలు బలంగా ఉన్నాయి. జైలుకు వెళ్లిన వారికి, అక్రమ కేసులు ఎదుర్కొన్న సామాన్యులకు తగిన గుర్తింపు లభించలేదు. కొద్దిమందికే పదవులు దక్కాయని, మెజారిటీ పోరాట య...
పైలట్ రోహిత్ రెడ్డిపై కేసీఆర్ సీరియస్.. 
Hyderabad

పైలట్ రోహిత్ రెడ్డిపై కేసీఆర్ సీరియస్.. 

బీఆర్ఎస్ షోకాజ్ నోటీసు! మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారశైలిపై భారత్ రాష్ట్ర సమితి (BRS) అధినేత కె. చంద్రశేఖర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేస్తూ, పార్టీ అధిష్టానం రోహిత్ రెడ్డి కి షోకాజ్ నోటీసు జారీ చేసింది. మాదక ద్రవ్యాల (Drugs) వినియోగానికి సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలు, ఆరోపణలను పార్టీ సీరియస్‌గా తీసుకుంది. క్రమశిక్షణారాహిత్యం మరియు పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తించినందుకు గాను రోహిత్ రెడ్డికి పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.మీడియాలో వస్తున్న ఆరోపణలపై వారం రోజుల్లోగా స్పష్టమైన లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.నిర్ణీత గడువులోగా సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోతే, పార్టీ నియమావళి ప్రకారం సభ్యత్వంపై వేటు (బహిష్కరణ) తప్పదని అధిష్టానం హెచ్చరించింది. పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడ...
Hyderabad | చేపల వేటకు వెళ్లిన ముగ్గురు యువకులు మృతి.. ఒకే కాలనీలో విషాద ఛాయలు!
Crime

Hyderabad | చేపల వేటకు వెళ్లిన ముగ్గురు యువకులు మృతి.. ఒకే కాలనీలో విషాద ఛాయలు!

Hyderabad News | సరదాగా చేపల వేటకు వెళ్లిన ముగ్గురు స్నేహితుల ప్రాణాలను మూసీ నది (Musi River) బలితీసుకుంది. గండిపేట జలాశయం దిగువన ఉన్న మూసీ నది పరివాహక ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ విషాదకర ఘటన వెలుగుచూసింది. మృతులంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఇబ్రహీంబాగ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలేం జరిగిందంటే? హైదరాబాద్ (Hyderabad) ఇబ్రహీంబాగ్‌కు చెందిన కార్తీక్ (25), గోవర్ధన్ (23), వెంకటేష్ (25) ముగ్గురూ ప్రాణ స్నేహితులు. ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా చేపలు పట్టేందుకు గండిపేట పరివాహక ప్రాంతంలోని మూసీ నది వద్దకు వెళ్లారు. అయితే, నదిలో నీటి ఉధృతి, లోతు ఎక్కువగా ఉండటంతో వారు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయారు. యువకులు నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు, రెస్క్యూ టీం ఆదివారం సాయంత్రం నుంచే గాలింపు చర్యలు చేపట్టింది....
error: Content is protected !!