Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Rice Mill Scam | ‘అరవింద’ రైస్ మిల్లులో భారీ గోల్‌మాల్!
Special Stories

Rice Mill Scam | ‘అరవింద’ రైస్ మిల్లులో భారీ గోల్‌మాల్!

వేల క్వింటాళ్ల సర్కారు ధాన్యం మాయం! ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే అధికారులు విస్తుపోవాల్సిందే Narsampet Rice Mill Scam | వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ప్రముఖ రైస్ మిల్లు 'అరవింద' ఇప్పుడు తీవ్ర ఆరోపణల సుడిగుండంలో చిక్కుకుంది. ప్రభుత్వం నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కోసం సేకరించిన వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వలు మిల్లులో కనిపించకపోవడం (Rice mill Paddy Missing) స్థానికంగా కలకలం రేపుతోంది. రికార్డులకు, మిల్లులోని అసలు నిల్వలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో 'ధాన్యం ఆవిరైందా? లేక అమ్మేశారా?' అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. Rice Mill Scam : అసలేం జరిగింది? ప్రభుత్వం ప్రతి ఏటా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, తిరిగి పౌరసరఫరాల శాఖకు (CMR రూపంలో) అప్పగించే బాధ్యతను రైస్ మిల్లులకు అప్పగిస్తుంది.2025-26 ఖరీఫ్ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 2567 మెట్రిక్ టన్నుల ధాన్యాన్...
Food Safety | తెలంగాణలో హోటళ్లపై FSSAI పంజా: వేల సంఖ్యలో తనిఖీలు.. వందల మందికి భారీ జరిమానాలు!
State

Food Safety | తెలంగాణలో హోటళ్లపై FSSAI పంజా: వేల సంఖ్యలో తనిఖీలు.. వందల మందికి భారీ జరిమానాలు!

హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార నాణ్యత (Food Safety) విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) స్పష్టం చేస్తోంది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో తెలంగాణవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. వేల సంఖ్యలో ఆహార నమూనాలను సేకరించి విశ్లేషించిన అధికారులు, నిబంధనలు ఉల్లంఘించిన వందలాది హోటళ్లపై కఠిన చర్యలు తీసుకున్నారు. మూడేళ్ల రిపోర్ట్: గణాంకాలు ఏం చెబుతున్నాయి? తెలంగాణలో ఆహార భద్రతా తనిఖీలు ఏడాదికేడాది పెరుగుతున్నాయి. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర తినుబండారాల తయారీ కేంద్రాలపై అధికారులు నిశితంగా దృష్టి సారిస్తున్నారు. ఆర్థిక సంవత్సరంవిశ్లేషించిన నమూనాలుజరిమానా పడిన హోటళ్లురద్దు చేసిన లైసెన్సులు2024-253,347125012023-246,156425062022-234,80931509 వాడిన నూనెపై ‘రుకో’ (RUCO) నిఘా! వంట నూనెను పదేపదే మరిగించడం వల్ల అది ఆరోగ...
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే  లక్ష్యం: నాగుర్ల వెంకటేశ్వర్లు
warangal

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే  లక్ష్యం: నాగుర్ల వెంకటేశ్వర్లు

రాష్ట్ర అభివృద్ధిలో ఎరువులు, విత్తనాల డీలర్ల పాత్ర అత్యంత కీలకమని తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు అన్నారు. శివనగర్‌లో జరిగిన నూతన రాష్ట్ర కార్యవర్గ సన్మాన సభలో ఆయన మాట్లాడారు. ప్రధానాంశాలు: నాణ్యతకే ప్రాధాన్యం: డీలర్లు రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు మాత్రమే విక్రయించాలని, నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని సూచించారు. బాధ్యతాయుత అమ్మకాలు: క్షేత్రస్థాయిలో పరీక్షించని ఉత్పత్తులను ప్రమోట్ చేయవద్దని, రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. ఆత్మగౌరవ భవనం: అందరి సహకారంతో రాష్ట్ర స్థాయిలో అసోసియేషన్ భవనాన్ని నిర్మిస్తామని, డీలర్ల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు. నిబంధనల అమలు: ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేస్తూ, డీలర్ల మధ్య ఐక్యతను కాపాడుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యద...
మాజీ డిజిపి హెచ్.జె. దొర మృతి
Hyderabad

మాజీ డిజిపి హెచ్.జె. దొర మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్.జె. దొర మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పోలీస్ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, డీజీపీగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా, సీఐఎస్‌ఎఫ్ డీజీగా కీలక బాధ్యతలు నిర్వహించిన దొర, పోలీస్ శాఖలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని సీఎం గుర్తుచేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేయడమే కాకుండా, పోలీసులను ప్రజలకు చేరువ చేయడంలో ఆయన కృషి మరువలేనిదని అన్నారు. దొర  కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు...
మత సామరస్యానికి వరంగల్ ప్రతీక: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
warangal

మత సామరస్యానికి వరంగల్ ప్రతీక: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

కాజీపేటలోని ఫాతిమా మాత మహోత్సవ వేడుకల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో చర్చి నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరంగల్ నగరం మత సామరస్యానికి, భిన్నత్వంలో ఏకత్వానికి నిలువుటద్దమని కొనియాడారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులంతా కలిసిమెలసి ఉండటమే ఈ ప్రాంత ప్రత్యేకతని, ఇలాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు సమాజంలో సోదరభావాన్ని మరింత పెంపొందిస్తాయని అన్నారు. భక్తులందరికీ ఫాతిమా మాత ఆశీస్సులు లభించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మానస రాంప్రసాద్, మాజీ కార్పొరేటర్ అబూబకర్, సీనియర్ నాయకులు ఎస్.టి. పాల్ ఆనంద్, విశ్రాంత బిషప్ జోసెఫ్, ఫాదర్ విజయపాల్, చర్చి గురువులు మర్రెడ్డి, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు....
error: Content is protected !!