రంగశాయిపేటలో రావణవధ కు ఏర్పాట్లు పూర్తి – Dasara Ravanavadha
                    Dasara Ravanavadha 2025 | వరంగల్ : విజయదశమి పర్వదినం సందర్భంగా అక్టోబర్ 2న గురువారం సాయంత్రం రంగశాయిపేటలోని మహంకాళి గుడి ఆవరణలో రావణవధ కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రంగశాయిపేట దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ తెలిపారు. మంగళవారం మహంకాళి గుడి ఆవరణలో రంగశాయిపేట దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ ప్రధానకార్యదర్శి దామెరకొండ కరుణాకర్ లు ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించినారు.ఈ సందర్భంగా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ మాట్లాడుతూ ఈ ఏడాది 36 ఫీట్ల ఎత్తైన రావణ ప్రతిమను ఏర్పాటు చేయడంతోపాటు వివిధ రకాల బాణసంచాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ రావనవధ (Ravanavadha) కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావు, విశిష్టఅతిథిగా నగర మేయర్ గుండు సుధారాణి ప్రభాకర్, గౌరవ అతిథులుగా వరంగల్...                
                
             
								



