NALA Conversion Scam | తహశీల్దార్ కన్వర్షన్ ల కహానీ
వరంగల్ శివార్లలో 'నాలా' దందా: తహశీల్దార్ కన్వర్షన్ల కహానీ!
ధరణి, భూభారతి లోపాలే పెట్టుబడిగా అక్రమాల పర్వం..
40కి పైగా అక్రమ వెంచర్లకు క్లియరెన్స్. ప్రభుత్వ ఖజానాకు భారీ గండి.
Warangal NALA Conversion Scam భూమి రికార్డుల ప్రక్షాళన కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి, భూభారతి పోర్టల్ లోని సాంకేతిక లోపాలు కొందరు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) శివార్లలోని ఒక మండల తహశీల్దార్, నిబంధనలను తుంగలో తొక్కి రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 40కి పైగా అనధికారిక (Non-Layout) వెంచర్లలోని వందలాది ప్లాట్లకు నిబంధనలకు విరుద్ధంగా నాలా (NALA) కన్వర్షన్లు మంజూరు చేయడం ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అక్రమ వెంచర్లకు 'నాలా' అండ
సాధారణంగా ఏదైనా భూమిని వెంచర్‌గా మార్చాలంటే కుడ...




