తెలంగాణ ఉద్యమకారుల ‘గోస’..కాంగ్రెస్ సర్కార్‌పైనే ఆశలు.. – Telangana Agitators Welfare
మంత్రి పొన్నం ప్రభాకర్‌పైనే భారం!
Telangana Agitators Welfare : స్వరాష్ట్ర కల సాకారమై దశాబ్దం దాటినా, ఆ కల కోసం లాఠీ దెబ్బలు తిని, జైలు గోడల మధ్య నలిగిపోయిన సామాన్య ఉద్యమకారుల బతుకులు నేటికీ 'గోస' పడుతూనే ఉన్నాయి. పదవుల పంపకాలు పూర్తి కావడంతో పాలన గాడిలో పడింది కానీ, క్షేత్రస్థాయిలో పోరాడిన యోధుల సంక్షేమం మాత్రం ఇంకా హామీలకే పరిమితమైంది. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో మొండిచేయి ఎదురవ్వగా, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని ఉద్యమకారులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
బిఆర్ఎస్ హయాంలో అన్యాయం.. ఆవేదనలో ఉద్యమకారులు
తెలంగాణ ఉద్యమమే పునాదిగా అధికారంలోకి వచ్చిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ఉద్యమకారులను విస్మరించిందనే విమర్శలు బలంగా ఉన్నాయి. జైలుకు వెళ్లిన వారికి, అక్రమ కేసులు ఎదుర్కొన్న సామాన్యులకు తగిన గుర్తింపు లభించలేదు. కొద్దిమందికే పదవులు దక్కాయని, మెజారిటీ పోరాట య...




