Ebola Virus | బోలా కలకలం: డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన.. భారత్ అప్రమత్తం!
ప్రపంచం కరోనా మహమ్మారి భయాల నుంచి పూర్తిగా కోలుకోకముందే మరో ప్రమాదకర వైరస్ వార్తలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ (Ebola Virus) మళ్లీ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యంత అరుదుగా ప్రకటించే “పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్ー ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్” (గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ)ని ప్రకటించింది. ఒక వ్యాధి దేశాల సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపించే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం ఈ వైరస్ కాంగో, ఉగాండా దేశాల్లో వందల సంఖ్యలో కేసులతో వినాశనం సృష్టిస్తోంది.
ఈసారి ఎందుకంత భయం? ‘బుండిబుగ్యో’ స్ట్రెయిన్ కలవరం!
ఎబోలా ఆఫ్రికాకు కొత్త వ్యాధి కాకపోయినప్పటికీ, ఈసారి వెలుగులోకి వచ్చిన వైరస్ “బుండిబుగ్యో” (Bundibugyo) అనే అత్యంత అరుదైన, ప్రమాదకరమైన స్ట్రెయిన్ కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ స్ట్రెయిన్‌ను...




