Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Cylinder Price : వినియోగదారులకు ఊరట.. గ్యాస్ ధరలు  తగ్గాయ్..
Business

Cylinder Price : వినియోగదారులకు ఊరట.. గ్యాస్ ధరలు తగ్గాయ్..

Commercial Cylinder Price Reduce : వంట గ్యాస్ వినియోగదారులకు ఊరట లభించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు కేంద్రం తగ్గించింది. ఒక్కో సిలిండర్‌పై రూ. 33.50 పైసల రూపాయల మేర తగ్గించింది. ఈ ధరలు శుక్రవారం తెల్లవారు జాము నుంచే అమలులోకి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఒక ప్రకటన విడుదల చేశాయి. కాగా కమర్షియల్​ గ్యాస్​ సిలిండర్​ ధరలను తగ్గించడం ఈ ఏడాదిలో ఇది ఆరోసారి. జనవరిలో రూ. 14.50 పైసలు, ఫిబ్రవరిలో ఏడు రూపాయలు, ఏప్రిల్ లో 41 రూపాయల మేర వాణిజ్య అవసరాలకు వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ల రేట్లు తగ్గాయి. మరోవైపు, దేశ రాజధాని దిల్లీలో ఆగస్టు 1 నుండి, 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ఇక్కడ రూ.1631.50 కు లభిస్తుంది. వివిధ నగరాల్లో ధరల తగ్గింపు ఇలా ఢిల్లీ: ₹1,665 → ₹1,631.50 ముంబై: ₹1,616.50 → ₹1,583 కోల్‌కతా: ₹1,769 → ₹1,735.50 ...
13 ఏళ్ల మైనర్‌కు 40 ఏళ్ల వరుడు: తెలంగాణలో బాల్య వివాహం   కలకలం – Child Marriage
Crime

13 ఏళ్ల మైనర్‌కు 40 ఏళ్ల వరుడు: తెలంగాణలో బాల్య వివాహం కలకలం – Child Marriage

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో 13 ఏళ్ల బాలికను 40 ఏళ్ల వ్య‌క్తితో బలవంతంగా వివాహం (Child Marriage) చేశారు. ఆ బాలికకు పెళ్లి చేసే స్థోమ‌త లేక‌పోవ‌డంతో ఆమె కుటుంబం బాల్య వివాహం చేయాలని నిర్ణయించుకుంంది.మే నెలలో వివాహం జరిగిన కొన్ని రోజుల తర్వాత, ఆ మైనర్ బాలిక పాఠశాలలో తన ఉపాధ్యాయుడికి తన విష‌యాన్ని చెప్ప‌డంతో ఈ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆ ఉపాధ్యాయుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు దర్యాప్తు ప్రారంభించారు. 8వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని మే 28న కందివాడకు చెందిన 40 ఏళ్ల శ్రీనివాస్ గౌడ్ తో వివాహం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ బాలిక తన తల్లి, సోదరుడితో క‌లిసి నివసిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా ఆమె కుటుంబ స‌భ్యులు, ఓ మధ్యవర్తి ద్వారా 40 ఏళ్ల వ్యక్తిని సంప్రదించారు. ఈ క్ర‌మంలో వివాహం మే నెలలో జరిగింది. వివాహం జరిగిన వారం తర్వాత, ఆ అమ్మాయి ఇంటికి తిరిగ...
Holidays List |  ఆగస్టు 2025లో బ్యాంకులకు భారీ సెలవులు..  మొత్తం 15 రోజుల పాటు మూత!
Business

Holidays List | ఆగస్టు 2025లో బ్యాంకులకు భారీ సెలవులు.. మొత్తం 15 రోజుల పాటు మూత!

Bank Holidays in August 2025 | ఆగస్టు 2025 లో అనేక పండుగలు, జాతీయ సెలవులు రానున్నందున, దేశం అంతటా బ్యాంకులు 15 రోజుల వరకు మూతపడనున్నాయి. అయితే, అన్ని సెలవులు ప్రతి రాష్ట్రంలో ఒకే విధంగా వర్తించవని గమనించాలి. బ్యాంకు సెలవుల జాబితా, వాటి ప్రాంతీయ ప్రాముఖ్యత, కస్టమర్లు తమ లావాదేవీలను ముందుగానే ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకోండి. ఆగస్టు 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా ఆగస్టు 1 – బ్యాంక్ సెలవు (రాష్ట్రాన్ని బట్టి మారుతుంది) ఆగష్టు 8 - రక్షా బంధన్ (రాజస్థాన్, ఉత్తరాఖండ్, UPలో పాటిస్తారు) ఆగస్టు 9 - రెండవ శనివారం ఆగస్టు 15 – స్వాతంత్ర్య దినోత్సవం / పార్సీ నూతన సంవత్సరం (ముంబై, నాగ్‌పూర్) ఆగస్టు 16 – కొన్ని ఈశాన్య రాష్ట్రాలలో జోనల్ సెలవు. ఆగస్టు 23 - నాల్గవ శనివారం ఆగస్టు 25 - జన్మాష్టమి (అనేక రాష్ట్రాలు) తీజ్, హర్తాలిక ఓనం వంటి స్థానిక పండుగల ఆధారంగా ఇతర ప్రాంతీయ ...
Dengue Safety | వర్షాకాలంలో డెంగ్యూ ముప్పు పెరుగుతోంది – హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు
LifeStyle

Dengue Safety | వర్షాకాలంలో డెంగ్యూ ముప్పు పెరుగుతోంది – హెచ్చరిస్తున్న ఆరోగ్య నిపుణులు

Dengue Fever | భారీ వర్షాల కారణంగా విష‌జ్వ‌రాలు ముఖ్యంగా డెంగ్యూ కేసులు పెరుగుతాయని ఆరోగ్య అధికారులు హెచ్చరిస్తున్నారు. వాన‌లు కురిసిన‌పుడు నీరు నిలిచిపోతూ ఉంటుంది. కాలువ‌లు,నీటికుంట‌లు, పూల కుండలు, కూలర్లు, పాత‌ టైర్లు, నిర్మాణ ప్రదేశాలలో తరచుగా డెంగ్యూ వ్యాప్తికి కారణమైన ఏడిస్ ఈజిప్టి దోమకు సంతానోత్పత్తి ప్రదేశాలుగా పనిచేస్తాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, గత దశాబ్దంలో కర్ణాటకలో డెంగ్యూ కేసులు పదే పదే పెరుగుతున్నాయి, వేగవంతమైన పట్టణీకరణ, వ్యర్థాల నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల బెంగళూరులో ఎక్కువ శాతం కేసులు నమోదయ్యాయి. 2023లో, భారతదేశంలో దేశవ్యాప్తంగా 2.7 లక్షలకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (NVBDCP) తెలిపింది. సకాలంలో చికిత్స చేయకపోతే డెంగ్యూ లక్షణాలు త్వరగా తీవ్రమవుతాయి. డెంగీ (Dengue) సాధా...
KCR | క్షేత్రస్థాయిలో ఉద్యమాలకు సిద్ధం కండి
State, Hyderabad

KCR | క్షేత్రస్థాయిలో ఉద్యమాలకు సిద్ధం కండి

హైదరాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా రేవంత్ ప్రభుత్వంపై (Revanth Govt) క్షేత్రస్థాయిలో పోరాాటాలకు సిద్ధంకావాలని గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) పిలుపునిచ్చారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మంగళవారం (జులై 29) బీఆర్ఎస్ శ్రేణులతో కేసీఆర్ సమావేశమయ్యారు. రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఆంధ్రా ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పాలనా విధానాలను అమలుచేయడం దుర్మార్గమని అన్నారు. ఇక్కడ చంద్రబాబు..అక్కడ మోదీల ప్రయోజనాలను కాపాడేందుకు సీఎం తహతహ లాడుతున్నాడని, దీనిని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశాపూర్వకంగా పండబెట్టి.. వానాకాలం నాట్లు దగ్గరపడుతున్నా కూడా.. ఇంతవరకు రైతాంగానికి సాగునీరు అందించని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కన్నేపల్లి పంప్ హ...
error: Content is protected !!