Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
“ఎయిర్ కండిషనింగ్‌కి కొత్త నియమాలు: 20°C కంటే చల్లగా వద్దంట!” AC Temperature Guidelines 2025
LifeStyle, Trending

“ఎయిర్ కండిషనింగ్‌కి కొత్త నియమాలు: 20°C కంటే చల్లగా వద్దంట!” AC Temperature Guidelines 2025

AC Temperature Guidelines India 2025 భారతదేశంలోని ఎయిర్ కండిషనర్ల వినియోగంలో ఏసీల ఉష్ణోగ్రతలను ప్రామాణీకరించే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను తీసుకురావాలని భావిస్తోంది. ACల ఉష్ణోగ్రతలను 20°C కంటే తక్కువకు లేదా 28°C కంటే ఎక్కువకు ఉంచకూడదని నిబంధనలను రూపొందిస్తోంది. ఈవిషయాన్ని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) తాజాగా ప్రకటించారు. "ఎయిర్ కండిషనింగ్ ప్రమాణాలకు సంబంధించి, త్వరలో ఒక కొత్త నిబంధన (AC Temperature Rules) అమలు చేయనున్నారు. ACల ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ నుండి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య సెట్ చేయబడుతుంది. అంటే మనం 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ చల్లబరచలేం.. అలాగే 28 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి చేయలేం" అని ఖట్టర్ చెప్పారు. AC Temperature Guidelines : ఎందుకీ మార్పు? వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ...
ఈనెల 26 నుంచి తెలంగాణలో బోనాలు సంద‌డి -Telangana Bonalu 2025
State, Hyderabad

ఈనెల 26 నుంచి తెలంగాణలో బోనాలు సంద‌డి -Telangana Bonalu 2025

Bonalu 2025 festival in Telangana | రాష్ట్రంలో బోనాల పండుగ సంద‌డి మొద‌లైంది. ఈనెల 26 నుంచి హైదరాబాద్ గోల్కొండ బోనాలు ప్రారంభమవుతున్నాయి. కాగా ఈ సంవత్సరం హైదరాబాద్ నగరంలో బోనాల పండుగను వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వెల్లడించారు. ఈమేర‌కు బుధ‌వారం ఆషాడ బోనాల నిర్వ‌మ‌ణపై స‌మీక్ష‌ స‌మావేశం నిర్వహించారు. ఈసంద‌ర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. బోనాల పండుగ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు సురేఖ సూచించారు. ఇప్పటికే రూ. 20 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని సురేఖ వెల్లడించారు. Telangana Bonalu 2025 : 26న గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో .. ఈనెల 26న గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయం (Golconda Bonalu) లో ఉత్సవాలు ప్రారంభమవుతాయని మంత్రి కొండా సురేఖ వెల్ల‌డించారు. జూన్ 29న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం (Ujjaini...
కెసిఆర్ కు డాటర్ స్ట్రోక్.. – Kavitha controversy
Special Stories

కెసిఆర్ కు డాటర్ స్ట్రోక్.. – Kavitha controversy

కవిత ఎపిసోడ్ తో బిఆర్ఎస్ కు భారీ నష్టం.. Telangana Politics 2025 : రెండు దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా వెలుగొందారు. కేసీఆర్(KCR).. తనదైన వ్యూహాలు, రాజకీయ చ‌తుర‌త‌తో మహామహులకు ముచ్చెమటలు పట్టించిన రాజ‌కీయ ఉద్ధండుడైన ఆయ‌న ప‌దేళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా తెలంగాణ‌ను ఏక‌ఛ‌త్రాధిప‌త్యంతో పాల‌న కొన‌సాగిస్తూనే రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలను కోలుకోలేని దెబ్బతీశారు. అయితే ఇప్పుడు సొంత కూతురు క‌ల్వ‌కుంట్ల‌ కవిత ఎపిసోడ్ (Kavitha Controversy) కారణంగా కేసీఆర్‌ గట్టి దెబ్బ తిన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తున్న కేసీఆర్‌కు ఇది ఊహించని షాక్ గా మారిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇప్పటికీ కోలుకోలేక, పార్టీని మళ్లీ అధికారంలోకి ఎలా తీసుకురావాలో తెలియక మల్లగుల్ల...
తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు: 27 మంది ఉపాధ్యక్షులు, 69 ప్రధాన కార్యదర్శుల నియామకం – PCC Appointments 2025
Hyderabad, State

తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ మార్పులు: 27 మంది ఉపాధ్యక్షులు, 69 ప్రధాన కార్యదర్శుల నియామకం – PCC Appointments 2025

PCC Appointments 2025 : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (TPCC) కార్యవర్గాన్ని अखిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగా 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు నియమితులయ్యారు. ఈ ఎంపికల్లో సామాజిక న్యాయం, పార్టీ పట్ల విధేయత, ముఖ్యంగా యువతకు ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నియామకాల (PCC Appointments 2025 ) ద్వారా కాంగ్రెస్ పార్టీ యువత, సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ వచ్చే ఎన్నికల దృష్టితో బలమైన టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. క్షేత్రస్థాయిలో సేవలందించిన నేతలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నాయకులు, కొత్త తరానికి ప్రాధాన్యం కల్పిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో నియామకాలు జరిగాయి. PCC Appointments 2025 : ముఖ్య నేతలకు కీలక పదవులు ఎంపీ నక్కా రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బీఆర్ఎస్ నుండి కాంగ...
Railway Accident | కదులుతున్న రైలు నుంచి ప‌డిపోయిన ప్రయాణికులు.. ఐదుగురు మృతి
Crime, National

Railway Accident | కదులుతున్న రైలు నుంచి ప‌డిపోయిన ప్రయాణికులు.. ఐదుగురు మృతి

Mumbra Railway Station Accident : థానే(Thane) లోని ముంబ్రా రైల్వే స్టేషన్‌లో ఘోర ప్ర‌మాదం (Railway Accident | కదులుతున్న రైలు నుంచి ప‌డిపోయిన ప్రయాణికులు.. ఐదుగురు మృతి) చోటుచేసుకుంది. CSMT నుండి లక్నో వెళ్తున్న రైలు నుంచి సుమారు 10 నుండి 12 మంది ప్రయాణికులు ట్రాక్‌పై పడిపోయారు. ప్రమాదానికి కారణం రైలులో జనసమూహం ఎక్కువగా ఉండడ‌మేన‌ని భావిస్తున్నారు. ప్రయాణీకులు తలుపులకు వేలాడుతూ ప్రయాణిస్తున్నారని, ఇదే సమయంలో ప‌లువురు ప్ర‌యాణికులు ప‌ట్టుత‌ప్పి జారి కింద‌ప‌డిపోయార‌ని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. సోమవారం, ముంబ్రా రైల్వే స్టేషన్ వద్ద లక్నో (Mumbai To Lucknow) కు వెళ్లే పుష్పక్ ఎక్స్‌ప్రెస్ (Pushpak Express) (12534) రైలు నుండి అనేక మంది ప్రయాణికులు పట్టాలపై పడిపోయారు, అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. రైలులో ప్ర‌యాణికులు కిక్కిరిపోవ‌డంతో ఈ ప్రమాదం జరిగ...
error: Content is protected !!