Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Earthquake | ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం..
Crime, AndhraPradesh

Earthquake | ప్రకాశం జిల్లాను వణికించిన భూకంపం..

నాలుగు సెకండ్లపాటు కంపించిన భూమి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలాల ప‌రిధిలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆదివారం అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో ఈ భూప్రకంపనలు (Earthquake) చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇండ్ల నుంచి ప్రజలు పరుగులు పెడుతూ రోడ్లపైకి వొచ్చారు. ఈ భూ ప్రకంపనలు సుమారు నాలుగు సెకండ్ల పాటు కొనసాగినట్లు స్థానికులు వెల్ల‌డించారు. గత మే నెల 6న కూడా ప్రకాశం జిల్లాలో ఇదే మాదిరిగా భూకంపం సంభవించింద‌ని తెలిపారు. పొదిలిలో ఉదయం 9.54 గంటల సమయంలో భూమి కంపించడంతో ఆ ప్రాంతం ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఆ సమయంలో కూడా సుమారు ఐదు సెకండ్లపాటు ప్రకంపనలు కొనసాగినట్లు నివేదికలు తెలిపాయి. కొత్తూరు పరిధిలోని రాజు హాస్పిటల్ వీధి, ఇస్లాంపేట, బ్యాంక్‌ కాలనీ త‌దిత‌ర ప్రాంతాల్లో స్పష్టంగా ప్రకంపనలు గుర్తించారు. తెలంగాణ‌లోనూ భూకంపం (Ea...
Maganti Gopinath | బీఆర్ఎస్ MLA మాగంటి గోపీనాథ్ కన్నుమూత
Crime

Maganti Gopinath | బీఆర్ఎస్ MLA మాగంటి గోపీనాథ్ కన్నుమూత

MLA Maganti Gopinath Passes Away | తెలంగాణ రాష్ట్ర‌ రాజకీయాల్లో విషాదం నెలకొంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. దీర్ఘకాలంగా మూత్రపిండాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. గ‌త‌ గురువారం గుండెపోటుకు గురయ్యారు. చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిట‌ల్ కు తరలించగా గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గోపీనాథ్ ఆదివారం జూన్న‌ ఉదయం కన్నుమూశారు. చికిత్సకు ఆయన శరీరం ఏ మాత్రం స్పందించకపోవడంతో ఆసుపత్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త బీఆర్ఎస్ శ్రేణుల్లో, నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) రాజకీయ ప్రస్థానం 1963న జూన్ 2 జన్మించిన మాగంటి గోపీనాథ్.. రాష్ట్ర‌ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఆయన మొదట తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి ప్ర‌వేశించారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో బీఏ పూర్తి చేసిన మాగం...
Medigadda Incident | మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరిలో ఆరుగురు యువకుల గల్లంతు
State

Medigadda Incident | మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరిలో ఆరుగురు యువకుల గల్లంతు

Medigadda Incident | జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో శ‌నివారం రాత్రి వేళ‌ తీవ్ర విషాదక‌ర‌ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మహదేవపూర్ మండలం అంబటిపల్లి స‌మీపంలో మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) వద్ద గోదావరి నదిలో ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. గోదావరిలో శుక్రవారం సాయంత్రం స్నానానిక‌ని వెళ్లిన ఆరుగురు యువకులు తిరిగి బయటకు రాలేదు. మొత్తం 10 మంది వెళ్లగా అందులో ఆరుగురు గల్లంతయ్యారు. ఘటనపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) తీవ్ర‌ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే సహయక చర్యలు చేపట్టాలని అధికారుల‌ను ఆదేశించారు. కాగా నదిలో గ‌ల్లంత‌యిన‌వారిలో అంబటిపల్లికి చెందిన నలుగు యువకులు, కొర్లకుంటకు చెందిన ఇద్దరు యువకులు ఉన్న‌ట్లు స‌మాచారం. మహాదేవపుర్ ఎస్ఐ పవన్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని యువకుల కోసం గాలింపు చర్యలు చేప‌డుతున్నారు. గల్లంతైన యువకులు ఎవరు? స్నానానికి వెళ్లిన ...
Rains Forecast | రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు వచ్చే నాలుగు రోజులు వానలు
State

Rains Forecast | రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు వచ్చే నాలుగు రోజులు వానలు

Rains Forecast : రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాగల ఐదురోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ద్రోణి ప్రభావం కొనసాగుతుండగా, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్నాటక, తెలంగాణ మీదుగా కోస్తా ఆంధ్ర వరకు ఉపరితల ద్రోణి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిందని అధికారులు తెలిపారు. Rains Forecast : జిల్లాల వారీగా వర్ష సూచనలు: ఆదివారం (జూన్ 8):ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు...
Thug Life | మణిరత్నం – కమల్ కాంబో మాజిక్ మిస్..!
Cinema

Thug Life | మణిరత్నం – కమల్ కాంబో మాజిక్ మిస్..!

Thug Life Movie Review | కమల్ హాసన్ మణిరత్నం(Kamal Hassan, Mani Ratnam combo) వచ్చిన మూవీ నాయకుడు(nayakudu) సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో మనకు తెలిసిందే.ఆ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేయలేదు. మూడున్నర దశాబ్దాల తర్వాత వీరి కాంబోలో రిలీజ్ అయిన మూవీ థగ్ లైఫ్(Thug Life). వీరిద్దరి కాంబోలో వచ్చిన నాయకుడు సినిమాకు మించి ఈ మూవీ ఉంటుందన్న కమల్ హాసన్ స్టేట్మెంట్ కి తగ్గట్టుగా ఈ మూవీ ఉందా లేదా అనేది తెలుసుకుందాం… Thug Life స్టోరీ … రంగరాయ శక్తి రాజన్ (కమల్ హాసన్)ఒక పెద్ద డాన్. అతని పట్టుకునే క్రమంలోనే అమర్(శింబు) తండ్రి చనిపోతాడు. దీంతో రంగరాయ శక్తి రాజన్ అతడిని చేరదీస్తాడు. అమర్ శక్తిని కాపాడుకునే కుడి భుజం అవుతాడు. ఒక కారణం వల్ల వీరిద్దరు విడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే చూడాల్సిందే. మూవీ ఎలా ఉందంటే…. మణిరత్నం,కమల్ హాసన్ కాంబో దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత సెట్ అయిందంటే ఫాన్స...
error: Content is protected !!