సర్కారు ధాన్యం భద్రమేనా?
రూ.2కోట్ల ధాన్యం మాయం పై అనుమానాలు
Hanumakonda Paddy Scam | ఆ మిల్లులో ప్రభుత్వ ధాన్యం భద్రంగా ఉందా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి నెలకొంది. హనుమకొండ జిల్లా అగ్రంపహాడ్ శివారులోని మహాదేవ ఇండస్ట్రీస్ వేదికగా సివిల్ సప్లైస్ ధాన్యం పక్కదారి పట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మిల్లులో ఉండాల్సిన ధాన్యంలో సుమారు రూ. 2 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు విశ్వసనీయ సమాచారం.
రికార్డుల్లో ఉన్న లెక్కలకు.. మిల్లులో ఉన్న నిల్వకు భారీ తేడా?
2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పౌరసరఫరాల శాఖ 2991.920 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కోసం ఈ మిల్లుకు పంపించింది. నిబంధనల ప్రకారం.. మిల్లర్ ఆ ధాన్యాన్ని మరాడించి 2004.586 మెట్రిక్ టన్నులు అంటే 70 ఏసికెల బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలి. అయితే, ఇప్పటివరకు ఆ మిల్లర్ పౌరసరఫరాల శాఖకు కేవలం 12 ఏసికెల బియ్యాన్ని మాత్రమే ప...




