Mukul Dev | చిత్రసీమలో విషాదం.. ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ ఆకస్మిక మృతి
Mukul Dev | హిందీ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ (54) ఆకస్మికంగా కన్నుమూశారు. 'సన్ ఆఫ్ సర్దార్', 'ఆర్.. రాజ్‌కుమార్', 'జై హో' వంటి సినిమాలతో ఆయన ప్రేక్షకులకు సుపరిచితులు. ఆయన మరణం బాలీవుడ్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మోడల్, నటుడు ముకుల్ దేవ్ మృతి పట్ల బాలీవుడ్ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది, ముకుల్ దేవ్ మరణ వార్త ఆయన అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు, వారి అభిమానులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శనివారం, ముకుల్ దేవ్ సోదరుడు రాహుల్ దేవ్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఈ వార్తను ధృవీకరించారు.
రవితేజ (Raviteja) నటించిన కృష్ణ చిత్రంలో ముకుల్ దేవ్ (Mukul Dev) విలన్ గా అద్భుతంగా నటిం...




