Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
DIEO | అవును.. ’వేదాంతు‘కు అనుమతి లేదు
Special Stories

DIEO | అవును.. ’వేదాంతు‘కు అనుమతి లేదు

స్పష్టం చేసిన హన్మకొండ డీఐఈవో గోపాల్ హన్మకొండ డీఐఈవో (Hanamkonda DIEO) స్పందించారు. ఆ కాలేజీకి అనుమతులు లేవని స్పష్టం చేశారు. "బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్" కు రిపోర్ట్ రాసి పంపిస్తామని తెలిపారు. హన్మకొండ నగరంలో ఎలాంటి అనుమతి లేకుండా అకాడమీ పేరుతో ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల నిర్వహిస్తున్న వైనంపై సోమవారం "అనుమతి లేని వేదాంతు"అనే శీర్షికన సర్కార్ లైవ్ కథనం వెలువరించింది. ఈ కథనం పై స్పందించిన హన్మకొండ డీఐఈవో గోపాల్ (DIEO Gopal) మాట్లాడుతూ వేదాంతు (Vedantu) కు విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతి లేదని దీనిపై ఇంటర్మీడియట్ బోర్డు కు రిపోర్ట్ రాసి పంపిస్తామని సర్కార్ లైవ్ ప్రతినిధితో అన్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనుమతి లేకుండా అడ్మిషన్లు తీసుకోవద్దని ,అకాడమీ పేరుతో కళాశాల నిర్వహించడం సరికాదని డిఐఈవో తెలిపారు. కాగా ఇప్పటికే సదరు యాజమాన్యం అనుమతి లేకుండానే అడ్మిషన్ల పేరుతో విద్యార్థుల నుండి ఫీజుల ...
Pasmailaram Blast | పాశ‌మైలారం ఘ‌ట‌న‌లో 45కి చేరిన మృతుల సంఖ్య
Crime

Pasmailaram Blast | పాశ‌మైలారం ఘ‌ట‌న‌లో 45కి చేరిన మృతుల సంఖ్య

గుర్తించలేని స్థితిలో మృతులు.. డీఎన్‌ఏ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్న ప్ర‌భుత్వం Sangareddy | సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారం (Pasmailaram ) పారిశ్రామికవాడలోని సిగాచి క్లోరో కెమికల్స్ భారీ పేలుడు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 45కి చేరింది. ఇది తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా కొందరు భావిస్తున్నారు.NDRF, HYDRAA, తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు రేయింబవళ్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. వివిధ ఆసుపత్రులలో 35 మంది చికిత్స పొందుతుండగా, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. బహుశా, ఇది తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా ప‌లువురు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పటాన్‌చెరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అక్కడి నుండి మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించడానికి ప్రభుత్వ...
మళ్లీ నవ్వించే టైమ్ వచ్చేసింది! హెరాఫేరీ 3లో పరేష్ రావెల్ తిరిగొస్తున్నాడా? – Hera Pheri 3
Cinema

మళ్లీ నవ్వించే టైమ్ వచ్చేసింది! హెరాఫేరీ 3లో పరేష్ రావెల్ తిరిగొస్తున్నాడా? – Hera Pheri 3

హిట్ ఫ్రాంచైజీ లు ఈ మధ్య ఎలా ఆడుతున్నాయో మనకు తెలుసు. బాలీవుడ్ హిట్ ఫ్రాం చైజీ హెరాఫేరీ (Hera Pheri 3) కి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఇంతకు ముందు వచ్చిన రెండు పార్టులు కూడా భారీ విజయాలనే అందుకున్నాయి. ఒకప్పుడు సినిమాను ఏలిన బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ మధ్య సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతోంది. భారీ అంచనాలతో వచ్చిన మూవీస్ కూడా బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతున్నాయి. వందల కోట్ల హీరోల సినిమాలు కూడా యావరేజ్ రేంజ్ లోనే ఆగిపోతున్నాయి. అప్పుడప్పుడు ఒకటో రెండో సినిమాలు బాలీవుడ్ కి ఊపిరి పోస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో హెరాఫేరీ ప్రాంచైజీ నుండి మూవీ ని అనౌన్స్ చేశారు. హెరాఫేరీ 3 (Hera Pheri 3)రాబోతున్నట్టు తెలిపారు. తొలి రెండు పార్టుల లో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, టబు, పరేష్ రావెల్ (Akshay Kumar, Sunil Shetty, tabu, Paresh Ravel) మెయిన్ క్యారెక్టర్ లలో యాక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చే మూడో పార్టు ని అక్షయ్ క...
Mee Seva | మీ సేవా కేంద్రాల్లో అందుబాటులోకి మరిన్ని సేవలు
State, Hyderabad

Mee Seva | మీ సేవా కేంద్రాల్లో అందుబాటులోకి మరిన్ని సేవలు

మీ సేవ కేంద్రాల్లో (Mee Seva Centers) మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్, భూముల మార్కెట్ విలువ సర్టిఫికేట్ వంటి సేవలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Minister Duddilla Sridhar babu) సోమవారం అధికారికంగా ప్రారంభించారు. దీనిపై సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన తాజా సేవల తీరును పరిశీలించారు. ఇకపై మ్యారేజీ రిజిస్ట్రేష‌న్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిర‌గాల్సిన అవసరం ఉండదు. ఇకపై దరఖాస్తుదారులు స్లాట్ బుకింగ్ ద్వారా ముందుగానే అపాయింట్‌మెంట్‌ తీసుకోవచ్చు. పెళ్లి తాలూకు ఫొటోలు, చిరునామా, వయస్సు రుజువులతో పాటు అవసరమైన పత్రాలు సమర్పిస్తే, ధ్రువీకరణ అనంతరం సర్టిఫికేట్‌ను ప్రత్యక్షంగా ఎస్ఆర్వో కార్యాలయంలో పొందవచ్చు. Mee Seva : భూముల మార్కెట్ వ్యాల్యూ సర్టిఫికెట్ కూడా.. భూముల తాజా మార్కెట్ విలువ తెలుసుకోవాలంటే ఇక చాలా సులువు. మీ సేవ కేంద్రం (Mee seva ...
Raja Singh | బిజెపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా?
State, Hyderabad

Raja Singh | బిజెపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా?

తెలంగాణ బీజేపీ (Telangana BJP) లో అంత‌ర్గ‌త విభేదాలు మొద‌లైన‌ట్లు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడి ఎంపిక‌పై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (MLA Raja Singh ) మరోసారి సంచ‌ల‌న‌ నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. కాగా బీజేపీ హైకమాండ్‌ను టార్గెట్‌ చేసి రాజాసింగ్ ప‌లు విమర్శలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌ రావును అధిష్టానం ఖరారు చేసిన విష‌యం తెలిసిందే.. ఈ విష‌యంపై ​గోషామ‌హ‌ల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడుతూ..‘రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంద‌ని, రాష్ట్ర అధ్యక్షుడిని బూత్‌ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటు వేసి ఎన్నుకోవాల‌ని, అంతేకానీ, పార్టీలో మావాడు, మీవాడు అంటూ నియమిస్తుంటే పార్టీకి నష్టం వ‌స్తుంద‌ని తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే కచ్చితంగా ఎన్నిక నిర్వహి...
error: Content is protected !!