Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
వాసం శ్రీనివాస్ కు .. ప్రొఫెసర్ గా పదోన్నతి…..
warangal

వాసం శ్రీనివాస్ కు .. ప్రొఫెసర్ గా పదోన్నతి…..

సంగెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన విద్యావేత్త డాక్టర్ వాసం శ్రీనివాస్‌కు ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది. ఉన్నత విద్యా కళాశాలల కమిషనర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ పదోన్నతి అమలులోకి వచ్చింది. గ్రామీణ నేపథ్యం నుంచి ఎదిగి విద్యారంగంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించిన ఆయన విజయం కొత్తగూడెం గ్రామంతో పాటు సంగెం మండల ప్రజలకు గర్వకారణంగా మారింది. సంగెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన వాసం వీరస్వామి, సోమలక్ష్మి దంపతుల కుమారుడైన డాక్టర్ వాసం శ్రీనివాస్ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసించిన ఆయన, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసి, కాకతీయ విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా సాధించారు. 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ఏపీపీఎస్సీ పోటీ పరీక్షలో ఉత్తీర్ణులై రసాయన శాస్త్రంలో జూనియర్ లెక్చరర్‌గా తన ఉపా...
Women’s Day | మహిళా దినోత్సవ ప్రత్యేక కవిత: ‘మంజుల అనే నేను’.. అబల కాదు, మార్పుకు తొలి అడుగు నేను!
State

Women’s Day | మహిళా దినోత్సవ ప్రత్యేక కవిత: ‘మంజుల అనే నేను’.. అబల కాదు, మార్పుకు తొలి అడుగు నేను!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం – మార్చి 8, 2026 Women's Day 2026 | ఒక మహిళ ఎదుగుదల వెనుక ఎన్నో గాయాలు, మరెన్నో అవమానాలు ఉండవచ్చు. కానీ, వాటన్నింటినీ తట్టుకుని నిలబడినప్పుడే అసలైన నాయకురాలు జన్మిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రముఖ కవయిత్రి, సామాజిక కార్యకర్త మరియు మాజీ ఆలేరు ఏఎంసీ డైరెక్టర్ శ్రీమతి మంజుల పత్తిపాటి గారు తన అంతరంగాన్ని కవితా రూపంలో ఆవిష్కరించారు. 'మంజుల అనే నేను' పేరుతో ఆమె రాసిన ఈ కవిత ప్రతి మహిళలోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మంజుల అనే నేను గాయాల్ని గుండెల్లో దాచుకుని గర్వంగా నవ్వడం నేర్చుకున్నాను! పడిపోతూ కూడా నిలబడటం నేర్చుకున్నాను! నిశ్శబ్దంగా కనిపించినా నిర్ణయాల్లో గర్జించే శక్తిని నేను! నేను మహిళను మాత్రమే కాదు మార్పుకు మొదటి అడుగు నేను! నన్ను ఆపాలని ప్రయత్నించిన చేతులు ఇప్పుడు నా విజయానికి చప్పట్లు కొడుతున్నాయి! నన్ను ఆపాలని వచ్చిన చీకట్లు ...
షాకింగ్ ఘటన: బీర్ బాటిల్‌లో చేప పిల్ల.. అది కూడా ఈదుతూ! వీడియో వైరల్ – Fish in Beer Bottle
Viral

షాకింగ్ ఘటన: బీర్ బాటిల్‌లో చేప పిల్ల.. అది కూడా ఈదుతూ! వీడియో వైరల్ – Fish in Beer Bottle

హైదరాబాద్ : బీర్ ప్రియులకు ఊహించని షాక్! వేసవిలో కాస్త ఉపశమనం కోసం చల్లటి బీర్ తాగుదామని బాటిల్ కొన్న ఓ వ్యక్తికి అందులో వింత దృశ్యం కనిపించింది. బాటిల్ లోపల ఓ చిన్న చేప పిల్ల హాయిగా ఈదుతూ (Fish in Beer Bottle) కనిపించడంతో ఆ కస్టమర్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. హైదరాబాద్‌లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో ఈ విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే? మల్లాపూర్‌లోని జేపి వైన్ షాపులో ఓ వ్యక్తి శుక్రవారం నాడు ఒక కింగ్‌ఫిషర్ లైట్ (Kingfisher Light) బీర్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. తాగేందుకు సిద్ధమై బాటిల్ మూత తీయబోతుండగా, లోపల ఏదో కదులుతున్నట్లు గమనించాడు. నిశితంగా పరిశీలించగా.. అందులో ఒక చిన్న చేప పిల్ల ప్రాణంతో ఉండి, ఈదుతూ కనిపించింది. సీల్డ్ బాటిల్‌లో చేప పిల్ల ఎలా వచ్చిందనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. బీర్ బాటిల్‌లో ప్రత్యక్షమైన చేప పిల్ల హైదరాబాద్ – నాచారం ...
తెలంగాణ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా
Hyderabad

తెలంగాణ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా

తెలంగాణ గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..
Bala Kishore Reddy | రాజకీయాల్లో ‘బాల కిషోర్ రెడ్డి’ ప్రభంజనం: ప్రజాసేవే లక్ష్యంగా.. యువతే సైన్యంగా సరికొత్త ప్రస్థానం!
Special Stories

Bala Kishore Reddy | రాజకీయాల్లో ‘బాల కిషోర్ రెడ్డి’ ప్రభంజనం: ప్రజాసేవే లక్ష్యంగా.. యువతే సైన్యంగా సరికొత్త ప్రస్థానం!

Bala Kishore Reddy Political Journey | రాజకీయాల్లో మార్పు రావాలంటే కేవలం పదవులు ఉంటే సరిపోదు.. ప్రజలతో మమేకమయ్యే మనసుండాలని నిరూపిస్తున్నారు యువనేత బాల కిషోర్ రెడ్డి (Bala Kishore Reddy) . సామాజిక సేవను కేవలం బాధ్యతగా కాకుండా, ఒక రాజకీయ శక్తిగా మలుచుకుంటూ ఆయన సాగిస్తున్న ప్రస్థానం ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సేవే పునాదిగా.. ప్రజలే అజెండాగా! సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలోనే కనిపిస్తుంటారు. కానీ, బాల కిషోర్ రెడ్డి శైలి ఇందుకు భిన్నం. సామాజిక సేవను తన రాజకీయ ప్రస్థానానికి బలమైన పునాదిగా మార్చుకుంటున్నారు. ఇటీవల ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు, మహిళల సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరు బాల కిషోర్ రెడ్డిని ఒక నాయకుడిగా ప్రజల్లో నిలబెడుతోంది. కొమ్మాల జాతరలో ప్రభా బండ...
error: Content is protected !!