శాయంపేటలో ‘కుడా’ భారీ వెంచర్: స్వచ్చందంగా భూములు ఇచ్చేందుకు సిద్దమైన రైతులు – KUDA Mega Venture
KUDA Mega Venture Shayampet Haveli | వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట హవేలి పరిధిలో కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) సరికొత్త, భారీ లేఅవుట్‌కు శ్రీకారం చుట్టబోతోంది. ప్రతిష్టాత్మక మెగా టెక్స్‌టైల్ పార్క్(Kakatiya Mega Textile Park)కు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయాలని కుడా అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వ పర్యవేక్షణలో సాగే ఈ మెగా వెంచర్ స్థానిక రియల్ ఎస్టేట్ రంగానికి సరికొత్త ఊపునిస్తోంది.
స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న రైతులు
సాధారణంగా ల్యాండ్ పూలింగ్ లేదా భూసేకరణ అనగానే రైతుల నుంచి వ్యతిరేకత రావడం చూస్తుంటాం. కానీ, శాయంపేట హవేలి (Shayampet Haveli)లో అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. కుడా లేఅవుట్ వల్ల తమ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తులో తమకు దక్కే వాటా ప్లాట్లకు భారీ డిమాండ్ ఉంటుందని గ్రహించిన స్థానిక రైతులు.. ఈ వ...




