గుడ్ న్యూస్.. కాజీపేట, కాచిగూడ నుంచి రిషికేశ్‌కు ప్రత్యేక రైలు -SCR
SCR Special Train | ప్రయాణికులకు దక్షిణ మధ్య (SCR) రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కాచిగూడ, కాజీపేట రైల్వేస్టేషన్ల మీదుగా ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌కు ప్రత్యేక రైళ్ల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. యశ్వంత్‌పూర్-యోగ్ నగరి రిషికేశ్ (06597)కు ప్రతీ గురువారం రైలు ప్రయాణికులకు సేవలందిస్తుందని తెలిపింది. ఈ రైలు గురువారం ఉదయం 7 గంటలకు రిషికేశ్‌లో బయలుదేరి ఆదివారం గమ్యస్థానం చేరుతుంది. ఈ రైలు కాచిగూడలో రాత్రి 8.50 గంటలకు.. కాజీపేటలో 11.33 గంటలకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
రిషికేశ్-యశ్వంత్‌పూర్ (06598) రైలు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఆదివారం సాయంత్రం 5.55 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ రైలు రెండు మార్గాల్లో యెలహంక జంక్షన్, హిందుపూర్, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూల్ సిటీ, కాచిగూడ, కాజీపేట, బల్లర్షా, నాగ్‌పూర్, భోపాల్, బినా జంక్షన్, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కాంట్...




