Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Vemulawada | వేముల‌వాడ‌లో ముమ్మ‌రంగా కూల్చివేత‌లు
State, Karimnagar

Vemulawada | వేముల‌వాడ‌లో ముమ్మ‌రంగా కూల్చివేత‌లు

Rajanna Siricilla News | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన‌ వేములవాడలో (Vemulawada) బుల్డోజ‌ర్లు (Bulldozers) కూల్చివేత‌లు ప్రారంభించాయి. సోమ‌వారం ఉద‌యం నుంచే అధికారులు ప్ర‌దాన‌ రోడ్ల వెంట‌ భవనాలను కూల్చివేస్తున్నారు. వేముల‌వాడ‌ పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణ (Vemulawada Road expansion ) పనులలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా బిల్డింగ్‌లను నేలమట్టం చేస్తున్నారు. మొత్తం 10 జేసీబీలతో పది బృందాలు నిర్విరామంగా కూల్చివేత‌లు చేప‌డుతున్నాయి. అధికారుల‌ను ఈ పనులను క్షేత్ర‌స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఇండ్లు, దుకాణాలను య‌జ‌మానులు దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కూలీలలో సామాన్లు తొలగిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్య‌లో పోలీసులను మోహరించారు. అయితే ప్రధాన రోడ్డు వైపు వాహనాలు రాకుండా అమరవీరుల స్తూపం వద్ద బారికేడ్లు ఏర్పాటుచేశారు Vemulawada : రోడ్ల విస్తరణకు రూ.47కోట్లు.. ...
Helicopter Crashes | కూలిన హెలీకాప్ట‌ర్‌.. ఐదుగురు మృతి
Crime

Helicopter Crashes | కూలిన హెలీకాప్ట‌ర్‌.. ఐదుగురు మృతి

కేదార్‌నాథ్‌కు వెళ్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లో కూలిపోయింది. డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్‌కు వెళ్తున్న ఈ ప్ర‌మాదం (Helicopter Crashes) లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు ఆర్యన్‌ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్‌.. కేదార్‌నాథ్ ఆలయం నుంచి గుప్తకాశీకి బ‌యలుదేరింది. ఈ క్రమంలో వాతావరణం అనుకూలించకపోవడంతో అదుపు తప్పిన హెలికాప్టర్‌ గౌరీకుండ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయింది. దీంతో హెలికాప్ట‌ర్ లో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో పైలట్‌తో పాటు ఓ చిన్నారి కూడా ఉన్నట్లు స‌మాచారం. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. కాగా ఘటనా స్థలానికి రెస్క్యూ సిబ్బందిని పంపామని, అయితే హెలికాప్టర్‌ దట్టమైన అటవీ ప్రాంతంలో పడిపోవడంతో అక్కడికి చేరుకోవడం కొంత జాప్య‌మ‌వుతోంద‌ని అధికారులు వెల్లడించారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ ...
Galwan | గాల్వన్ ఘర్షణకు ఐదేళ్లు.. భారత ప్రాతినిధ్యం ఎలా మారింది?
World

Galwan | గాల్వన్ ఘర్షణకు ఐదేళ్లు.. భారత ప్రాతినిధ్యం ఎలా మారింది?

Galwan | ఐదేళ్ల క్రితం 2020 జూన్ 15న, తూర్పు లడఖ్‌లో చైనాతో జరిగిన గాల్వన్ లోయ ఘర్షణలో భారతదేశం 20 మంది సైనికులను కోల్పోయింది. ఈ సంఘటన భారతదేశం-చైనా సంబంధాలను పూర్తిగా మార్చివేసింది. వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి భారతదేశ రక్షణ ప‌రిస్థితులు, వ్యూహాత్మక ప్రణాళికలో సంస్కరణలకు దారితీసింది. ప్రస్తుత ప్రోటోకాల్‌ల ప్రకారం భారత దళాలు తుపాకీలు లేకుండానే ప్రతీకారం తీర్చుకున్న గాల్వన్ ఘర్షణ చైనా వైపు కూడా గణనీయమైన ప్రాణనష్టానికి కారణమైంది, రెండు పొరుగు దేశాల‌ మధ్య నమ్మకం పూర్తిగా దెబ్బతింది. ఆ తరువాత సంవత్సరాల్లో, భారతదేశం తన సైనిక సంసిద్ధతను గణనీయంగా పునర్నిర్మించింది, సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేసింది మరియు దౌత్య కార్యకలాపాలను తీవ్రతరం చేసింది. భారత సాయుధ దళాలు LAC అంతటా, ముఖ్యంగా తూర్పు లడఖ్‌లో తమ ఉనికిని పెంచుకున్నాయి, దళాలను, అధిక ఎత్తులో యుద్ధ పరికరాలను వేగంగా మోహరించాయి. Galwa...
Ranjith Reddy | విద్యా సేవలో యువ నాయకుడు..
Special Stories

Ranjith Reddy | విద్యా సేవలో యువ నాయకుడు..

లక్ష్యం 10 వేల మంది పేద విద్యార్థులకు చదువు నిరుపేద పిల్లలకు చదువును దగ్గర చేస్తున్న యువ నాయకుడు పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 2,500 బ్యాగులను పంపిణీ చేసిన రంజిత్ రెడ్డి ఇప్పటికే 120 మంది విద్యార్థులకు విద్యాదానం..? Hanmakonda : పేద విద్యార్థులకు చదువును అందించడమే అతని లక్ష్యం. పేదరికంలో మగ్గిపోతూ చదువుకోవడానికి నానా అగచాట్లు పడుతున్న పేద పిల్లలకు నేనున్నానంటూ అక్కున చేర్చుకుంటాడు. ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులకు వారి చదువుకు అయ్యే ఆర్థిక వనరులను సమకూరుస్తూ, వారి కలలను సాకారం చేస్తున్న "రంజిత్ రెడ్డి (Ranjith Reddy) "పై సర్కార్ లైవ్ అందిస్తున్న ప్రత్యేక కథనం.. హన్మకొండ (Hanmakonda) జిల్లా రెడ్డిపురానికి చెందిన రంజిత్ రెడ్డికి చదువుపై మొదటి నుంచి ఎంతో మక్కువ. చదువుకోవాలనే తపన ఉండి, చదువుకు పేదరికం అడ్డుగా ఉన్న ఎంతో మంది విద్యార్థుల చదువుకు అవసరమైన ...
PM Modi | జీ-7 సదస్సుకు ప్రధాని.. మూడు దేశాల పర్యటనకు సిద్ధం
World, National

PM Modi | జీ-7 సదస్సుకు ప్రధాని.. మూడు దేశాల పర్యటనకు సిద్ధం

G7 Summit | న్యూదిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటనకు సిద్ధ‌మ‌వుతున్నారు. సైప్రస్‌, కెనడా(Canada), క్రొయేషియా దేశాలలో ఐదు రోజులపాటు పర్యటించనున్నారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడోలైడ్స్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో ఈనెల 15, 16వ‌ తేదీల్లో పర్యటించనున్నారు. దాదాపు 20 ఏళ్ల‌ తర్వాత అక్కడ పర్యటించనున్న మొదటి భారత ప్రధాని మోదీనే కావ‌డం విశేషం. కాగా ఈ పర్యటనలో భాగంగా ప్రధాని న‌రేంద్ర మోదీ సైప్రస్‌ అధ్యక్షుడితో చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకోవడం, మధ్యధరా ప్రాంతం, యూరోపియన్‌ యూనియన్‌లతో సంబంధాలను మరింత బ‌లోపేతం చేసే విధంగా ఇరు దేశాల మధ్య కీల‌క ఒప్పందాలు జరగనున్నాయి. ఇక సైప్ర‌స్ నుంచి ప్రధాని మోదీ కెనడాకు బ‌య‌లుదేరివెళ్ల‌నున్నారు. ఆ దేశ నూత‌న‌ ప్రధాని మార్క్‌ కార్నీ ఆహ్వ...
error: Content is protected !!