Rains | నగరంలో మరోమారు భారీ వర్షం
Hyderabad Rains | హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, కృష్ణానగర్, మియాపూర్, చందనాగర్, మాదాపూర్, రాయదుర్గం, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. యూసుఫ్‌గూడా కృష్ణానగర్ బి బ్లాక్‌లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో వాహనదారులు, ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్‌లో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. అర్‌పేట, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి.ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా వర్షం దంచికొట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, యూసుఫ్‌గూడ, అర్‌పేట్, పంజాగుట్ట, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. మరోవైపు గంటల తరబడి ట్రాఫిక్...




