Skip to main content

Sarkar Live

Author: Avunuri virat

ఆవునూరి విరాట్.. స‌ర్కార్ లైవ్ లో ఆయ‌న డిజిట‌ల్ కంటెంట్ ప్రొవైడ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 6 సంవ‌త్స‌రాలకుపైగా అనుభవం ఉంది. రాష్ట్ర‌, జాతీయ, అంత‌ర్జాతీయ అంశాల‌కు సంబంధించిన క‌థ‌నాల‌ను అందిస్తుంటారు.
Jatadhara Movie : జటాధర రిలీజ్ డేట్ ఫిక్స్..!
Cinema

Jatadhara Movie : జటాధర రిలీజ్ డేట్ ఫిక్స్..!

Jatadhara Release Date : టాలీవుడ్ హీరో సుధీర్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు బావగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. SMS, శివ మనసులో శృతి సినిమాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన, మారుతి దర్శకత్వం వహించిన ప్రేమ కథా చిత్రంతో భారీ విజయం సాధించాడు. ఆ తర్వాత సమ్మోహనం, భలే మంచి రోజు వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేదు. ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత, భారీ మైథలాజికల్ జానర్ మూవీ జటాధరతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తుండగా, జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ విడుదల చేసిన పోస్టర్, తర్వాత విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన...
Security Jobs | ట్రాన్స్‌జెండర్లకు మెట్రో రైళ్ల‌లో సెక్యూరిటీగా విధులు
State, Hyderabad

Security Jobs | ట్రాన్స్‌జెండర్లకు మెట్రో రైళ్ల‌లో సెక్యూరిటీగా విధులు

Security Jobs in Hyderabad Metro | “ట్రాన్స్‌జెండర్లు (Transgenders) ఎందులోనూ తక్కువ వారు కాదు, తలెత్తుకుని బ‌తికే వారని సమాజానికి నిరూపించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో గౌరవప్రదమైన అవకాశాన్ని కల్పించింది” అని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌ల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్‌ల వద్ద భిక్షాటన చేసిన వారికి ట్రాఫిక్ నియంత్రణలో అవకాశాలు కల్పించగా, ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైళ్ల‌లో 20 మందిని సెక్యూరిటీ గార్డులుగా నియమించడం చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచిందన్నారు.మంగళవారం మంత్రి ఛాంబర్లో 20 మంది ట్రాన్స్‌జెండర్‌లకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ వార్డులుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సెక్యూరిటీ గార్డు (Security Jobs) నియామకాల కోసం దాదాపు 300–400 మంది దరఖాస్తు చేసుకోగా, నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేశామని తె...
Nalgonda | పోక్సో కోర్టు సంచ‌ల‌న తీర్పు
Crime

Nalgonda | పోక్సో కోర్టు సంచ‌ల‌న తీర్పు

ప‌దేళ్ల బాలికపై లైంగిక‌దాడికి పాల్ప‌డిన వృద్దుడికి 24 ఏళ్ల జైలు Nalgonda News | అభంశుభం తెలియ‌ని ప‌దేళ్ల బాలిక‌పై పాశ‌వికంగా లైంగిక దాడికి పాల్ప‌డిన కామాంధుడైన‌ వృద్ధుడు నల్లగొండ (Nalgonda ) మండలం అన్నెపర్తి గ్రామానికి చెందిన మర్రి ఊషయ్య (60)కు పోక్సో కోర్టు (POCSO Court) 24ఏళ్ల జైలు శిక్ష (24 Years Jail Sentence) విధించింది. ఈ కేసు పూర్వ‌ప‌రాల్లోకి వెళితే.. 2023 మార్చి 28న నాలుగో తరగతి చదువుతున్న 10 ఏళ్ల మైనర్ బాలిక బడికి వెళ్లి ఇంటికి వ‌చ్చి నిద్రపోతున్న సమయంలో ఊష‌య్య అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి బాలిక‌కు తిను బండారాలు ఇచ్చి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఎవరికైనా చెప్పితే చంపేస్తాన‌ని బాలిక‌ను బెదిరించారు. విషయం తెలుసుకున్న‌ బాధితురాలి తల్లి 2023 మార్చి 29న‌ నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్ ( SHO) కంచర్ల భాస్కర్ రెడ్డి నిందితుడు ఊష‌య్య‌పై...
Harish Rao | విద్యార్థులకు డబ్బుల్లేవు.. కానీ టెండర్లకు లక్షల కోట్లు ఎక్క‌డివి?
State, Nalgonda

Harish Rao | విద్యార్థులకు డబ్బుల్లేవు.. కానీ టెండర్లకు లక్షల కోట్లు ఎక్క‌డివి?

ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై హరీశ్ రావు ఆగ్రహం హైదరాబాద్ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధుల విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని మాజీ మంత్రి టీ హరీశ్ రావు (BRS MLA Harish Rao ) విమర్శించారు. రెండేళ్లుగా యాజమాన్యాలు నిధులు ఇవ్వమని వేడుకుంటున్నా, రేవంత్ సర్కారు మోసపూరిత వైఖరి అవలంబిస్తోందని ఆయన మండిపడ్డారు.ఈసంద‌ర్భంగా హ‌రీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్ కళాశాలలు మూతపడే పరిస్థితి వచ్చింది.దాదాపు 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాల్సిన దశ రావడం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి తానే విద్యాశాఖ మంత్రిగా ఉన్నా చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరంగా ఉన్నాయి. ఇప్పటికే సెప్టెంబర్ 16 నుంచి విద్యాస...
Illegal Liquor : అక్రమ మద్యం, డ్రగ్స్‌పై ఉక్కుపాదం
State, Hyderabad

Illegal Liquor : అక్రమ మద్యం, డ్రగ్స్‌పై ఉక్కుపాదం

క‌ల్తీ క‌ల్లు, గంజాయి, డ్రగ్స్‌, నాటుసారా, ఎన్‌డీపీఎల్‌ నేరాలపై ఉక్కు పాదం మోపాలని ప్రొహిబిష‌న్ & ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణ‌రావు అధికారుల‌ను ఆదేశించారు. నాంప‌ల్లిలోని తెలంగాణ అబ్కారీ భవన్‌లో శ‌నివారం అబ్కారీ, ఎన్‌ఫొర్స్‌మెంట్‌, ‌ ఎస్టిఎఫ్ అండ్ డిటిఎఫ్ , ఎన్‌ఫొర్స్‌మెంట్ విభాగం ప‌నితీరుపై మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స‌మీక్షించారు. అక్ర‌మ‌, క‌ల్తీ మ‌ద్యం, క‌ల్తీ క‌ల్లు, డ్ర‌గ్స్, గంజాయి, ఇత‌ర మాద‌క‌ద్ర‌వ్యాల విక్ర‌యం, ర‌వాణా, వినియోగం, నాన్‌డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌, చ‌ర్ల‌ప‌ల్లి ప్యాక్ట‌రీలో డ్ర‌గ్స్ ముడి స‌రుకు త‌యారీ, ఎన్డీపీఎస్ కేసుల పురోగ‌తి, శిక్ష‌ల రేషియో, పాత నేర‌స్తుల‌, నిందితుల‌పై నిఘా, త‌దిత‌ర అంశాల‌పై సుధీర్ఘంగా చ‌ర్చించారు. అక్రమ మద్యాన్ని(Illegal Liquor) , గంజాయి తదితర మాదక ద్రవ్యాల సరఫరాతో సంబంధం ఉన్న‌వారిని వెంట‌నే గుర్తించి వారిని పీడీ యాక్టు కింద అరెస్టు చేయాలన...
error: Content is protected !!