కంట తడి పెట్టిస్తున్న ‘అనగనగా..’ – Anaganaga Movie Review
Anaganaga Movie Review | తెలుగు సినీ ఇండస్ట్రీలో కొందరు విభిన్నమైన క్యారెక్టర్ లు చేస్తూ వారికంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంటారు. హిట్టు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వారు అనుకున్న కథను తెరపైకి తీసుకొస్తుంటారు.అలాంటి మూవీస్ చేసి తన కంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు సుమంత్(sumanth). మొదటి మూవీనే రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)డైరెక్షన్ లో చేసి సూపర్ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత కొన్ని మూవీస్ తీసి మంచి మెప్పించిన సుమంత్ కెరీర్ గాడి తప్పింది. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు దాటిన తనకు నచ్చిన మూవీనే తీసుకుంటూ వచ్చాడు. తను సాలిడ్ హిట్టు కొట్టి చాలా కాలమే అయ్యింది.కొన్ని మూవీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు. పూర్తిగా తన మార్కెట్ డౌన్ ఫాలో అయిందనుకుంటుండగా ఈటీవీ విన్ లో అనగనగా (anaganaga)అనే మూవీని రిలీజ్ చేశారు. క్రిషి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై(krishi entertainment bannar)రాకేష్ రెడ్డి,రు...