Kamal Hassan | కన్నడలో థగ్ లైఫ్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు…?
కన్నడ భాష పై విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Hassan) చేసిన వ్యాఖ్యలు తెగ దుమారం రేపాయి.మణిరత్నం (maniratnam)డైరెక్షన్లో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కమల్ యాక్ట్ చేసిన థగ్ లైఫ్ (Thug Life) మూవీ జూన్ 5న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. కాగా మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కమల్ హాసన్ కన్నడ భాష తమిళ్ నుండే పుట్టిందని వ్యాఖ్యలు చేశారు. దీనిపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎలా అలాంటి వ్యాఖ్యలు చేస్తారని కమల్ హాసన్ ఆ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాల్సిందేనని కన్నడ ఫిలిం ఛాంబర్ కోరింది.
దీనిపై కమల్ మాట్లాడుతూ నేను సారీ చెప్పను నేను అన్న దాంట్లో తప్పేమీ లేదని వివరణ ఇచ్చారు. దీంతో కన్నడ ఫిలిం ఛాంబర్ ఈ మూవీపై నిషేధం విధించింది. విడుదల దగ్గరపడుతుండగా కమల్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మూవీ రిలీజ్ అయ్యేలా చూడాలని, థియేటర్ల వద్ద ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. కమల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు కమల్ ...