PM Modi | జీ-7 సదస్సుకు ప్రధాని.. మూడు దేశాల పర్యటనకు సిద్ధం
G7 Summit | న్యూదిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. సైప్రస్, కెనడా(Canada), క్రొయేషియా దేశాలలో ఐదు రోజులపాటు పర్యటించనున్నారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో ఈనెల 15, 16వ తేదీల్లో పర్యటించనున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత అక్కడ పర్యటించనున్న మొదటి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం. కాగా ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకోవడం, మధ్యధరా ప్రాంతం, యూరోపియన్ యూనియన్లతో సంబంధాలను మరింత బలోపేతం చేసే విధంగా ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరగనున్నాయి.
ఇక సైప్రస్ నుంచి ప్రధాని మోదీ కెనడాకు బయలుదేరివెళ్లనున్నారు. ఆ దేశ నూతన ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వ...