Corruption | రియల్టర్లకు తహసీల్దార్ సహకారం
అక్రమ వెంచర్లలోని వందలాది ప్లాట్లను గజాల వారీగా కన్వర్షన్
జిడబ్ల్యూఎంసీ ఆదాయానికి భారీగా గండి
భారీగా ముడుపులు చేతులు మారినట్లు ప్రచారం
Corruption in Kazipet | ఒక్కటి కాదు.. రెండూ కాదు.. వందల సంఖ్యలో నాలా కన్వర్షన్ లు చేసి సదరు తహసీల్దార్ రియల్టర్లకు ఊహించని రీతిలో సహకరించినట్లు తెలుస్తోంది. అనుమతి లేని వెంచర్లలోని వందలాది ప్లాట్లను సదరు తహసీల్దార్ (Tahasilar) నాలా కన్వర్షన్ (Nala Conversion) చేయడంతో రియల్టర్లు ఆ తహసీల్దార్ ను కన్వర్షన్ కిం(సిం)గ్ పిలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వెంచర్ అక్రమం అని తెలిసినా, జిడబ్ల్యూఎంసీ ఆదాయానికి రియల్టర్లు గండి కొడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నా.. సదరు తహసీల్దార్ ధరణిలోని చిన్న చిన్న లోపాలను ఆసరాగా చేసుకుని నాన్ లేఅవుట్ వెంచర్లలోని ప్లాట్లను (రియల్టర్ చేసిన ప్లాట్లకు అనుగుణంగా, గజాల వారీగా) నాలా కన్వర్షన్ చేసి రియల్టర్లకు రిస్క్ లేకుండా చే...