Sarkar Live

State

Engineering Education : ఇంజినీరింగ్‌ కోర్సులు మాకొద్దంటున్న విద్యార్థులు.. కారణాలేంటీ?
State

Engineering Education : ఇంజినీరింగ్‌ కోర్సులు మాకొద్దంటున్న విద్యార్థులు.. కారణాలేంటీ?

Engineering Education : తెలంగాణ రాష్ట్రంలో ఇంజ‌నీరింగ్ విద్య‌కు ఆద‌ర‌ణ త‌గ్గుతోంది. ముఖ్యంగా సివిల్‌, మెకానిక‌ల్‌, ఎల‌క్ట్రిక‌ల్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆస‌క్తి చూప‌డం లేదు. దీంతో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిష‌న్లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఈ విద్యా సంవత్సరానికి ( 2024-25) మేనేజ్‌మెంట్ కోటా కింద 6 వేల‌ సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. 10 కాలేజీల్లో భ‌ర్తీకాని అడ్మిష‌న్లు తెలంగాణలో మొత్తం 175 ఇంజినీరింగ్ కాలేజీలు (Engineering Colleges) ఉన్నాయి. వీటిలో 1.08 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా 36 వేల సీట్లు మేనేజ్‌మెంట్ కోటా కింద ఉంటాయి. ఇప్పటి వరకు 30 వేల‌ సీట్లు భర్తీ అయిన‌ప్ప‌టికీ ఇంకా 6 వేలు సీట్లు ఖాళీగానే ఉన్నాయి. 10 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా కింద ఒక్క అడ్మిషన్ కూడా భ‌ర్తీ కాలేదు. ఈ కాలేజీలు అధికంగా B-కేటగిరీ (మేనేజ్‌మెంట్ కోటా) అడ్మిషన్లపై ఆధారపడటం వల...
Sankranti Special Buses : పండుగ‌ పూట ఆర్టీసీ దోపిడీ
State

Sankranti Special Buses : పండుగ‌ పూట ఆర్టీసీ దోపిడీ

Sankranti Special Buses : సంక్రాంతి పండగ పూట తెలంగాణ ప్ర‌భుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచి జేబుల‌ను గుల్ల చేస్తోంద‌ని ప్ర‌యాణికులు గ‌గ్గోలు పెడుతున్నారు. పండగ పూట స్వ‌గ్రామాల‌కు వెళ్లేందుకు నగరవాసులు పల్లెబాట పడుతుండగా.. ఇదే అదునుగా చేసుకుని ఆర్టీసీ యాజమాన్యం చార్జీలు పెంచేసింద‌ని ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. ఈరోజు నుంచి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. దీంతో బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లు ప్రయాణికులు తీవ్ర‌ రద్దీతో కిట‌కిట‌లాడుతున్నాయి.ఈ నేపథ్యంలో.. టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం జనవరి 09 నుంచే సంక్రాంతి స్పెషల్ బస్సులను న‌డిపిస్తోంది. అయితే.. సంక్రాంతి స్పెషల్ బస్సుల పేరుతో.. టికెట్ రేట్లను అమాంతం పెంచేసి త‌మ‌ను నిలువునా దోచేస్తోంద‌ని ప‌లువురు ప్ర‌యాణికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు ఈ మేరకు ప్రయాణికులు ధ‌ర‌లు పెంచిన టికెట్ల ను ఫొటోలు తీసి సోషల్ మీడియాల్లో షే...
Sircilla : నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌.. కాపాడిన  పోలీసులు
State

Sircilla : నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్‌.. కాపాడిన పోలీసులు

Sircilla Kidnap Case : నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్ సిరిసిల్ల (Sircilla) జిల్లాలో క‌ల‌క‌లం రేపింది. వేముల‌వాడ రాజ‌న్న స‌న్న‌ధిలో డిసెంబ‌రు 23న ఓ పాప‌ కిడ్నాప్‌న‌కు గురికాగా పోలీసులు ఎంతో శ్ర‌మ‌కోర్చి కాపాడారు. నిందితులైన ముగ్గురు మ‌హిళ‌ల‌ను సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మ‌హ‌జ‌న్ ఈ రోజు మ‌ధ్యాహ్నం మీడియా ఎదుట‌ ప్ర‌వేశ‌పెట్టారు. ఆయ‌న తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జగిత్యాల జిల్లా కోడిమియాల్ మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సింగరాపు మధు, లాస్య దంప‌తుల‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లాస్య మ‌తిస్థిమితం స‌రిగా లేక‌పోవ‌డం వ‌ల్ల ఆమె తన భర్తతో వేరుగా ఉంటోంది. ఇటీవ‌ల తన పిల్ల‌ల‌తో కలిసి వేముల‌వాడ (Vemulawada)లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి (Sri Rajarajeshwara Swamy temple) లాస్య వెళ్లింది. ప‌రిచ‌య‌మైన మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ మ‌హిళ‌లు లాస్య వేముల‌వాడలో ఉండ‌గా మహబూబాబాద్ (Mahabubabad)కు చెందిన శ్రీరామోజి వ...
HYDRA | మణికొండలో హైడ్రా కూల్చివేతలు షురూ..
State

HYDRA | మణికొండలో హైడ్రా కూల్చివేతలు షురూ..

HYDRA రాష్ట్రంలోని చెరువులు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైడ్రా.. కబ్జాదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే పలు చెరువులు, కుంటను కబ్జాదారుల చెర నుంచి రక్షించింది. వందల ఎకరాల మేర ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. తాజాగా జీహెచ్ఎంసీ ప‌రిధి నెక్నాంపూర్ చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైడ్రా అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా శుక్రవారం.. మణికొండలోని నెక్నాంపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప‌నుల‌ను హైడ్రా అధికారులు ప్రారంభించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ ఆదేశాల మేరకు భారీ పోలీసు బందోబస్తు మ‌ధ్య‌ ఈ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. రంగారెడ్డి జిల్లా మణికొండ ప్రాంతంలో విస్తరించిన‌ అక్రమ నిర్మాణాలపై హైడ్రా (HYDRA) స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. చెరువును కబ్జా చేసిన భారీ భవనాలు నిర్మిస్తున్నట్లు ఇక...
Tirupati stampede : తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై న్యాయ విచారణ; ముగ్గురు అధికారుల బదిలీ, ఇద్దరి స‌స్పెన్ష‌న్‌..
State

Tirupati stampede : తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై న్యాయ విచారణ; ముగ్గురు అధికారుల బదిలీ, ఇద్దరి స‌స్పెన్ష‌న్‌..

Tirupati temple tragedy : తిరుమ‌ల‌ తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాట (Tirupati stampede) లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయి పదుల సంఖ్యలో గాయపడిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు (Chief Minister N Chandrababu Naidu) న్యాయ విచారణకు ఆదేశించారు. దీంతో పాటు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌తో పాటు ముగ్గురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీ సహా ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయాలని సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు. ప్ర‌మాద ఘ‌ట‌న వ‌ద్ద ఇన్‌ఛార్జ్‌గా ఉన్న డీఎస్పీ రమణ్‌కుమార్‌, ఎస్వీ గోసాల డైరెక్టర్‌ డాక్టర్‌ హరినాథ్‌రెడ్డి సస్పెండ్‌ అయ్యారు. టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.గౌతమి, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్‌వో శ్రీధర్‌లు బదిలీ అయ్యారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న మహిళను తరలించేందుకు పద్మావతి పార్క్ వద్ద గేట్లను తెరవాలని కోరిన‌పుడు డిఎ...
error: Content is protected !!