Shankar : ఆ హీరో బయోపిక్ నేనే తీస్తా…
Director Shankar : ఇప్పుడు సినిమాలన్నీ పాన్ ఇండియన్ పేరుతో భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి కానీ ఒకప్పుడు భారీ బడ్జెట్లో సినిమా అంటే మొదట గుర్తొచ్చే పేరు డైరెక్టర్ శంకర్ (Shankar). ఖర్చుకు వెనకాడకుండా ఎన్ని కోట్లు ఖర్చు అయినా తన సినిమాలోని పాటలను అదిరిపోయే విజువల్స్ తో తెరకెక్కిస్తుంటారు.
శంకర్ దర్శకత్వంలో వచ్చిన జీన్స్ సినిమాలోని ఒక పాటలో ప్రపంచంలోనే ఏడు వింతలను చూపిస్తే ప్రేక్షకులు థ్రిల్ అయ్యారు. నిర్మాతలతో కోట్లు ఖర్చు పెట్టించినా అంతకంతకు వసూల్ అయ్యేలా ఈయన సినిమాలు ఉంటాయి. భాషతో సంబంధం లేకుండా సూపర్ హిట్ గా నిలుస్తాయి.
ఒక సినిమాకు మించి ఇంకో సినిమా భారీ హిట్ కొట్టడంతో అప్పటి బడా హీరోలు శంకర్ డైరెక్షన్ లో చాన్స్ కోసం ఎదురుచూశారు. సమాజంలో జరుగుతున్న అంశాలను కథగా తీసుకొని బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఒక శంకర్ కే సాధ్యమైంది. అందుకే ప్రొడ్యూసర్స్ కూడా ఈయన మీద నమ్మకంతో ఎన్ని కోట్లు అయినా ...




