నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక కోసం కొత్త యాప్..
Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ను సచివాలయంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ అనే విధంగా రెండో వసంతంలోకి అడుగుపెడుతున్నామని అన్నారు. ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కల.. ఆ పేదల కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఆనాడే కృషి చేశారి గుర్తు చేశారు. వ్యవసాయ భూమి పేదల ఆత్మగౌరవమని గుర్తించి అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకువచ్చి పేదలకు భూములను పంచారని చెప్పారు. తెలంగాణలోనే దాదాపు 35 లక్షల ఎకరాల భూమిని ఇందిరా గాంధీ పంపిణీ చేశారని తెలిపారు.
రాష్ట్రంలో గుడి లేని ఊరు ఉందేమో కానీ... ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని చెప్పారు. రూ.4వేలతో మొదలైన ఈ పథకం వైఎస్ హయాం వరకు రూ.లక్షా 21వేలకు చేరుకుందని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిని 5లక్షల రూపాయలకు పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ల...




