Kadapa | ఇంటర్ విద్యార్థిని హత్యలో ట్విస్ట్..
Kadapa News | కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఇంటర్మీడియట్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. పోలీసుల దర్యాప్తులో అనేక ముఖ్యమైన ఆధారాలు సేకరించారు. వైష్ణవి హత్యలో తన స్నేహితుడు లోకేశ్ పాత్ర లేదని డీఐజీ ప్రవీణ్ స్పష్టం చేశారు. విద్యార్థినిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని తెలిపారు. కాగా, ఎర్రగుంట్ల మండలానికి చెందిన వైష్ణవి గత సోమవారం కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టగా గండికోటలో విద్యార్థిని మృతదేహం లభ్యమైంది..
వైష్ణవి చివరిసారిగా స్నేహితులు లోకేష్ ద్విచక్ర వాహనంపై గండికోటకు వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో అతనే హత్య చేశాడని కుటుంబం ఆరోపిస్తోంది. దీనితో పోలీసులు లోకేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఇప్పటివరకు దర్యాప్తులో అతనికి హత్యకు సంబంధం లేదని డీఐజీ కోయ ప్రవీణ్ స్పష...