Sarkar Live

State

Bhu bharathi | జూన్ 2 నుంచి భూభార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు
State, Hyderabad

Bhu bharathi | జూన్ 2 నుంచి భూభార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు

Bhu bharathi | తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వమైన‌ జూన్ 2 నుంచి భూభార‌తి చ‌ట్టం (Bhu bharathi) లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. గ‌త నెల 14న భూభార‌తి చ‌ట్టాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల‌మీదుగా ప్రారంభించుకున్నామని, అదేనెల 17 నుంచి 30 వ‌ర‌కు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండ‌లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా రెవెన్యూ స‌ద‌స్సులు (Revenue seminars) నిర్వ‌హించామని తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు 28 జిల్లాల్లోని 28 మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు కొనసాగుతున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆయా మండలాల్లో ఎదురైన అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకొని జూన్ 2వ తేదీ నుంచి అన్ని మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించారు. ...
Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. రేపటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు!
State

Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. రేపటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు!

VIP Break Darshan : తిరులమ వేంకటేశ్వరస్వామి భక్తులకు (TTD Devotees) టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమల (Tirumala)లో 15వ తేదీ గురువారం నుంచి వీఐపీ సిఫార్సు లేఖలపై (VIP recommendation letters) బ్రేక్ దర్శనాలు పునఃప్రారంభమవుతాయని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకుంటామని ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. కాగా ఇటీవల తిరుమలలో భక్తుల కోలాహలం తగ్గడంతో టీటీడీ మళ్లీ సిఫార్సు లేఖలను స్వీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేసవి సెలవుల్లో రద్దీ కారణంగా సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా నెల రోజులుగా వీఐపీ సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే.. వీఐపీ బ్రేక్ దర్శనంలో సిఫారసు లేఖలు ఆమోదిస్తుంటారు. గత కొద్ది రోజులుగా ఆగిపోయిన ప్రత్యేక దర్శనాలను మళ్లీ ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు ఈ మేరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డ...
IMD Report | ఈసారి సాధార‌ణం కంటే అధిక‌ వ‌ర్ష‌పాతం
Districts

IMD Report | ఈసారి సాధార‌ణం కంటే అధిక‌ వ‌ర్ష‌పాతం

IMD Report | తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ శుభవార్త తెలిపింది. ఈసారి కాస్త ముందస్తుగానే వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు అండ‌మాన్‌లోకి ప్రవేశించినట్లు మంగళవారం మధ్యాహ్నం నాటికి అవి దక్షిణ అండమాన్‌ ‌సముద్రం, నికోబార్‌ ‌దీవులు, దక్షిణ బంగాళాఖాతాన్ని తాకినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాల ఆగమనంతో గత రెండు రోజులుగా నికోబార్‌ ‌దీవుల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కాగా, రానున్న మూడు, నాలుగు రోజుల్లో అండమాన్‌ ‌నికోబార్‌ ‌దీవులతో పాటు దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు రుతుప‌వ‌నాలు విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ (IMD ) వెల్లడించింది. మే 27వ తేదీ నాటికి ఈ రుతుపవనాలు కేరళను తాకే అవ‌కాశం ఉం‌దని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. IMD Report : జూన్ 12 నాటికి తెలంగాణకు రుతుపవనాలు కాగా, సాధారణంగా జూన్‌ 1‌వ తేదీ నాటికి ...
LRS Concession | ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువు మరోసారి పొడిగింపు
State, Hyderabad

LRS Concession | ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువు మరోసారి పొడిగింపు

LRS Concession | లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ సీమ్‌ (LRS) ఫీజుపై ఇస్తున్న 25 శాతం రాయితీ గడువును రాష్ట్ర స‌ర్కారు మ‌రోసారి పొడిగించింది. ఈనెల 3వ తేదీతో ముగిసిన గడువును మే 31 వరకు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌ ప్రకటించిన ప్రభుత్వం.. ఎల్‌ఆర్‌ఎస్‌పై రాయితీ గడువును తొలుత మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత దీనిని ఏప్రిల్‌ 30 వరకు, ఆ తర్వాత మే 3 వరకు పొడిగించింది. అయితే ఇప్పుడు మరోసారి మే 31వర‌కు రాయితీ అవ‌కాశం క‌ల్పించింది. కాగా ఎల్ఆర్ ఎస్ రాయితీ (LRS concession) పొడిగింపునకు ప‌లు కార‌ణాలు చెబుతున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తడం, ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో రాయితీ గడువును ప‌లుమార్లు పొడిగిస్తున్నట్టు ప‌లువురు పేర్కొంటున్నారు. 2020లో ప్రారంభమైన లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం కింద 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించ...
సమయం ముగిసింది.. నేడు డీజీఎంఓ స్థాయి చర్చలు – India-Pakistan ceasefire
State

సమయం ముగిసింది.. నేడు డీజీఎంఓ స్థాయి చర్చలు – India-Pakistan ceasefire

India-Pakistan ceasefire : మే 10న భారత్ - పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన తర్వాత, భారత సాయుధ దళాలు మీడియాకు ఇచ్చిన బ్రీఫింగ్‌లో పూర్తి వివరాలు వెల్లడించాయి. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి సాయుధ దళాలు వివరాలను అందించాయి, పహల్గామ్ దాడికి ప్రతిస్పందనగా భారత్ తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చిందని పేర్కొంది. ఈ దాడుల్లో భారత దాడులు ముదస్సర్ ఖాదియన్ ఖాస్ అలియాస్ అబు జుందాల్, మౌలానా మసూద్ అజార్ పెద్ద బావమరిది హఫీజ్ ముహమ్మద్ జమీల్, మొహమ్మద్ యూసుఫ్ అజార్, ఖలీద్ అలియాస్ అబు ఆకాషా మరియు మొహమ్మద్ హసన్ ఖాన్ వంటి కొంతమంది 'మోస్ట్ వాంటెడ్' ఉగ్రవాదులను హతమార్చాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ డ్రోన్ దాడుల తరువాత, భారత్ పాకిస్తాన్ లోని మరిన్ని లక్ష్యాలను ఛేదించింది. నూర్ ఖాన...
error: Content is protected !!