Mulugu : దారుణం.. మేనత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు
                    Mulugu : ములుగు జిల్లా వెంకటాపురం మండలం విఆర్ కె పురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మేనత్తను ఆమె అల్లుడు గొడ్డలితో నరికి చంపాడు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన గ్రామానికిచెందిన విజయ్ కుమార్ గత కొంత కాలంగా అతడు మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. మద్యానికిడబ్బులు లేకపోవడంతో తన మేనత్త ఎల్లమ్మ (60)ను తరచూ డబ్బులు అడుగుతూ వేదించేవాడు. అయితే ఆమె తన వద్ద డబ్బులు లేవని చెప్పడంతో వీరి మధ్య గొడవలు పెరిగాయి. ఈ క్రమంలో మేనత్తపై అల్లుడు గొడ్డలితో ఒక్కసారిగా దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు (Mulugu Police) ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్య చేసిన విజయ్ కుమార్ గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. 
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సం...                
                
             
								


