Modi Kuwait Visit | కువైట్ సింగర్ నోట.. సారే జహాన్ సే అచ్ఛా పాట
Modi Kuwait Visit : కువైట్ సింగర్ ముబారక్ అల్ రాషీద్ (Mubarak Al Rashed) మన దేశభక్తి గీతాన్ని ఆలపించారు. సారే జహాన్ సే అచ్ఛా అంటూ ఆహూతులను ఆకట్టుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటనలో భాగంగా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈవెంట్‌లో రాషీద్ ఈ పాటను పాడటంతో కువైట్ వాసులు మంత్రముగ్ధులయ్యారు. ప్రవాస భారతీయుల్లో భావోద్వేగం ఉప్పొంగింది. మనదేశం గొప్పదానాన్ని కువైట్ కొనియాడటంపై హర్షం వ్యక్తం చేశారు.
మోదీ గొప్పగా మాట్లాడారు : రాషీద్
ముబారక్ అల్ రాషీద్ ANIతో మాట్లాడుతూ కువైట్, భారతదేశం మధ్య బలమైన సంబంధంపై గర్వపడుతున్నాను. నా దేశం కువైట్ గొప్పదనం గురించి భారత ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) గొప్పగా వర్ణించారు. రెండు దేశాల మధ్య సంబంధం గురించి ఆయన బాగా మాట్లాడారు. ఆయన కువైట్ (Kuwait) ప్రజలకు భారతదేశాన్ని సందర్శించాలని కోరడం ఆనందాన్ని ఇచ్చిం...