Safest Countries | ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల జాబితా.. భారత్ అమెరికా, బ్రిటన్, చైనా ఎక్కడున్నాయి?
Safest Countries in the world 2025 | ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాల జాబితా విడుదలైంది. కానీ ఈ జాబితాలో అగ్రస్థానంలో అమెరికా, బ్రిటన్ లేదా ఏ శక్తివంతమైన యూరోపియన్ దేశం లేదు.. వాటికి బదులుగా ఇది స్పెయిన్, ఫ్రాన్స్ మధ్య ఉన్న నైరుతి ఐరోపాలోని ఒక చిన్న దేశమైన అండోరా సురక్షితమైన దేశంగా ప్రతిష్టను దక్కించుకుంది.. నంబియో సేఫ్టీ ఇండెక్స్ (numbeo Index ) ప్రకారం, అండోరా (Andora) ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా ర్యాంక్ పొందింది. ఆ దేశ జీవన ప్రమాణాలు, నేరాల రేటు ఆధారంగా సురక్షిత దేశాల ర్యాంకింగ్ రూపొందించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ర్యాంకింగ్‌లో భారతదేశం ర్యాంక్ అమెరికా, బ్రిటన్ కంటే మెరుగ్గా ఉంది.
భారతదేశ ర్యాంకింగ్ గురించి తెలుసుకునే ముందు, జాబితాలోని మొదటి ఐదు దేశాలను పరిశీలిద్దాం. సురక్షితమైన దేశాల జాబితాలో అండోరా తరువాత రెండవ స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. ఖతార్ మూ...