Relief for Multiplexes | రాత్రి 11 దాటినా పిల్లలు సినిమాలు చూడొచ్చు.. ఆంక్షలకు బ్రేక్
Relief for Multiplexes : మల్టీప్లెక్స్ థియేటర్ల యజమానులకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఊరటనిచ్చింది. 16 ఏళ్ల లోపు పిల్లలు రాత్రి 11 గంటల తర్వాత సినిమాలకు హాజరు కావద్దనే ఆంక్షలను తాత్కాలిక (temporary relief ) నిలిపివేసింది. ఆంక్షలు విధించే ముందు అన్నివర్గాల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. థియేటర్ యజమానులు, పిల్లల తల్లిదండ్రులు, బాల సంరక్ష సంస్థలు, వైద్య నిపుణులను సంప్రదించి మార్గదర్శకాలను రూపొందించి తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు ఈ ఆంక్షలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు న్యాయస్థానం తెలిపింది.
Multiplexes : యజమానుల ఆందోళన
రాత్రి 11 గంటల తర్వాత 16 ఏ ళ్ల పిల్లలు సినిమాలకు రావద్దనే ఆంక్షలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని మల్టీప్లెక్సుల యజమానులు ఇటీవల హైకోర్టును ఆ...