Maha Kumbh Stampede | మహాకుంభామేళాలో అపశ్రుతి
Maha Kumbh Stampede | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభామేళాలో ఈ రోజు అపశ్రుతి చోటుచేసుకుంది. మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా అమృత స్నానాన్ని ఆచరించే సమయంలో తొక్కిసలాట జరిగింది. గంగా, యమునా, పౌరాణిక సరస్వతి నదుల సంగమానికి ఒక కిలోమీటర్ దూరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
బారికేడ్లు విరిగిపడి..
మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానానికి (Amrit Snan) కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చారు. ఈ క్రమంలో ఆ ప్రదేశమంతా కిక్కిరిసిపోవడంతో బారికేడ్లు విరిగిపోయాయి. దీంతో గందరగోళం ఏర్పడి తొక్కిసలాట జరిగింది.
Maha Kumbh Stampede : ఆస్పత్రుల్లో క్షతగాత్రులు
మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానం కోసం సంగమానికి చేరుకోవడంతో ఈ తొక్కిసలాట జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో అనేక మంది మరణించారని, ...




