Punjab Bandh LIVE : స్తంభించిన పంజాబ్.. ఎందుకంటే..
Punjab Bandh LIVE : పంటలకు మద్దతు ధరను కల్పిస్తూ దాన్ని చట్టబద్ధత చేయాలని, తమ ఇతర సమస్యలను పరిష్కరించాలని సుదీర్ఘకాలంగా పోరాడుతున్న రైతులు తమ నిరసనను మరోరూపంలో వ్యక్తపరిచారు. తాజాగా పంజాబ్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ఆ రాష్ట్రంలో ఈ రోజు జనజీవనం స్తంభించింది. వ్యాపార, వాణిజ్య, రోడ్డు, రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది.
వ్యాపార వర్గాల మద్దతు
పంజాబ్ రైతుల బంద్ కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలను మూసివేశారు. ఇది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇది కొనసాగుతుందని రైతులు ప్రకటించారు. అత్యవసర సేవలు యథావిధిగా ఉంటాయన్నారు. సాయంత్రం వరకు పాల, పండ్లు, కూరగాయల సరఫరా ఉండదని, ఆ వ్యాపార సంఘాలు బంద్‌కు మద్దతు ప్రకటించాయని తెలిపారు. అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర వాహనాలను అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న వారు మాత్ర...