Amaravati Rajadhani : ఏపీకి కేంద్రం వరాల జల్లు.. అమరావతి రాజధానికి భారీ నిధులు..
Amaravati Rajadhani : అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టు (Amaravati Capital Development project)కు కేంద్ర ప్రభుత్వం (Central Government) భారీగా నిధులను విడుదల చేసింది. ప్రపంచ బ్యాంకు (World Bank) నుంచి మొట్టమొదటి విడతగా 205 మిలియన్ డాలర్ల (రూ. 1,700 కోట్లకు పైగా) నిధులు అందిన వెంటనే, కేంద్రం తన వాటా రూపంలో రూ. 800 కోట్లు విడుదల చేసింది. ఇలా మొత్తం రూ. 4,285 కోట్లు రాష్ట్రానికి జమ అయ్యాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
Amaravati Rajadhani : రూ. 15,000 కోట్ల ప్రణాళిక
రాజధాని అభివృద్ధి (Amaravati Capital Development project) కోసం కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో రూ. 15 వేల కోట్లను కేటాయించింది. ఇందులో ప్రపంచ బ్యాంకు (WB), ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు (Asian Development Bank (ADB) తలా USD 800 మిలియన్ (మొత్తం USD 1,600 మిలియన్) రూపంలో నిధులు సమకూర్చనున్నాయి. మిగిలిన రూ. 1,400 కోట్లు కేంద్ర ప్రభుత...




