Bomb Threat | వరంగల్ కోర్టుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అప్రమత్తం
Warangal Court Bomb Threat : వరంగల్ కోర్టులో ఈ రోజు ఉదయం భారీ కలకలం రేగింది. కోర్టు భవనంలో బాంబు ఉంచినట్లు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి న్యాయమూర్తికి ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు (Bomb Threa) సందేశం పంపాడు. ఈ సమాచారం అందుకున్న వెంటనే కోర్టు పరిసరాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. బాంబు బెదిరింపు నేపథ్యంలో కోర్టు పనులు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ఉద్యోగులు, న్యాయవాదులు,కక్షిదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Bomb Threat : అణవణువూ సోదాలు
వరంగల్ కోర్టుకు చేరుకున్న పోలీసులు అణువణువూ సోదాలు (Police Investigation) చేశారు. బాంబ్ స్క్వాడ్ (Bomb Squad Search), కేనైన్ (Police Canine Unit) టీమ్ సహాయంతో కోర్టు (Warangal Court) భవనం, ఆవరణను పూర్తిగా తనిఖీ చేశారు. గంటల తరబడి జరిగిన ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు ధృవీకరించారు. దీం...




