Warangal DTC | రవాణా శాఖపై ఫోకస్ పెట్టరెందుకు? డిటిసిని నియమించేదెప్పుడు ?
Warangal DTC | రాష్ట్రంలో పలు ప్రాంతీయ రవాణా సంస్థ కార్యాలయాలు, చెక్‌పోస్టుల వద్ద భారీగా అవినీతి జరుగుతోంది. కిందిస్థాయి సిబ్బందిపై పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులు లేకపోవడంతో సిబ్బది, ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన రుసుములతోనే అందాల్సిన సేవలు కార్యాలయాల్లో అదనంగా ముడుపులు అందిస్తే గానీ పని జరగని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
Warangal DTC నియామకం ఎప్పుడు?
ఇదిలా ఉంటే వరంగల్ ఉప రవాణా కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసు (Illegal Assets case) లో పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ (DTC) పుప్పాల శ్రీనివాస్ ( Puppala Srinivas)కు అవినీతి నిరోధక శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్న...




