Posani Krishna Murali | సీఐడీ కస్టడీకి పోసాని.. పలు కేసుల్లో విచారణ
Posani Krishna Murali : సినీ నటుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) (ని ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) ఈ రోజు విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఐటీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణ చేపట్టింది. పోసానిని జైలు నుంచి బయటకు తీసుకొచ్చి గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ కార్యాలయానికి తరలించారు.
Posani Krishna Murali : అరెస్టు అయినప్పటి నుంచి జైలులోనే..
గతవారం గుంటూరులోని ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు పోసానిని ఒకరోజు పోలీస్ కస్టడీలోకి అప్పగించింది. ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లో అరెస్టు అయినప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు....




