Google time travel feature | గతాన్ని తిరిగి చూడొచ్చు.. గూగుల్ కొత్త ఫీచర్
Google time travel feature : ప్రపంచవ్యాప్తంగా నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఓ ప్రాంతం 10-20 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో తెలుసుకోవాలంటే పాత ఫొటోలు లేదా పుస్తకాలను చూసి ఊహించుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ (Google Maps) కొత్త ‘టైమ్ ట్రావెల్’ (time travel) ఫీచర్ ద్వారా ఆ ప్రాంతం గతంలో ఎలా ఉండేదో ప్రత్యక్షంగా చూడొచ్చు (showing old images of streets, buildings and cities).
Google time travel feature : ఎలా పనిచేస్తుంది?
ఈ ఫీచర్ ఉపయోగించడం చాలా సులభం:
గూగుల్ మ్యాప్స్ లేదా గూగుల్ ఎర్త్ (Google Earth) ఓపెన్ చేయాలి.
మీరు చూడాలనుకున్న ప్రదేశాన్ని సెర్చ్ (search) చేయాలి.
లేయర్స్ (Layers) ఆప్షన్ క్లిక్ చేసి ‘టైమ్ లాప్స్’ (time lapse)సెలెక్ట్ చేయాలి.
గత దశాబ్దాల్లో ఆ ప్రదేశం ఎలా మారిందో చూడొచ్చు.ఈ ఫీచర్ ద్వారా మీరు పాత వీధులు, భవనాలు, ప్రకృతి మార్పులు, నగర అభి...




