Sarkar Live

Privacy Policy

Ratha Saptami | తిరుమ‌ల‌లో వైభ‌వంగా ర‌థ‌స‌ప్త‌మి.. క‌నుల పండువగా వేడుక‌లు
Trending

Ratha Saptami | తిరుమ‌ల‌లో వైభ‌వంగా ర‌థ‌స‌ప్త‌మి.. క‌నుల పండువగా వేడుక‌లు

Ratha Saptami : తిరుమల (Tirumala)లో రథసప్తమి ఉత్సవాలు అంగ‌రంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుక‌లు ఈ రోజు ప్రారంభ‌మ‌య్యాయి. మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఘ‌ట్టం భక్తులకు కనుల విందు చేసింది. రథసప్తమి ఉత్సవాలు తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం (Tirumala Tirupati Devasthanams (TTD) లో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ఈ ఏడాది కూడా ఇక్క‌డ విస్తృత ఏర్పాట్లు జ‌రిగాయి. మాడ వీధుల్లో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో జె. శ్యామలరావు ( (Executive Officer (EO) Shyamala Rao), అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప‌క‌డ్బందీ చర్యలు చేపట్టారు. గ్యాలరీల్లో అన్న ప్రసాదం పంపిణీ, తాగునీరు, మరుగుదొడ్లు, షెడ్లు త‌దిత‌ర‌ సౌకర్యాలను ఈవో పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప‌టిష్ట భ‌ద్ర‌త న‌డుమ Ratha S...
Railway projects | తెలంగాణలో రైల్వేకు మ‌హ‌ర్ద‌శ‌.. భారీ ప్రాజెక్టుల‌కు ప్ర‌ణాళిక‌
State

Railway projects | తెలంగాణలో రైల్వేకు మ‌హ‌ర్ద‌శ‌.. భారీ ప్రాజెక్టుల‌కు ప్ర‌ణాళిక‌

New Railway projects : తెలంగాణ (Telangana)లో రైల్వే వ్యవస్థ అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు పడింది. మ‌రికొన్ని కొత్త ప్రాజెక్టులు రాష్ట్రానికి రాబోతున్నాయి. మ‌రిన్ని సౌక‌ర్యాలు మెరుగుప‌డనున్నాయి. రైల్వే (Railway) ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ను పటిష్టం చేయ‌డం, ఎల‌క్ట్రీఫికేష‌న్‌, స్టేష‌న్ల ఆధునికీక‌ర‌ణ‌, వేగంగా న‌డిచే రైళ్ల కోసం ట్రాక్‌ల అప్‌గ్రేడ్ చేయ‌డం త‌దిత‌ర ప‌నులు చేప‌ట్ట‌నున్నారు. ముఖ్యంగా న‌మో భార‌త్ (Namo Bharat), అమృత్ భార‌త్ (Amrit Bharat) రైళ్ల‌ను త్వ‌ర‌లో ప్రారంభించ‌నున్నారు. వీట‌న్నిటికీ కేంద్రం కొత్త‌గా రూ.5,337 కోట్లు కేటాయించింది. తెలంగాణలో భారీగా పెట్టుబ‌డులు (Railway projects in telangana ) తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం రైల్వే నెట్‌వర్క్ ఇప్ప‌టికే వంద శాతం విద్యుదీకృతమైంది. దీనికి రూ. 41,677 కోట్ల భారీ పెట్టుబడి పెట్టారు. ఈ ప్రాజెక్ట్‌తో రాష్ట్రంలో రైళ్ల వేగం పెరుగుతుంది. ఇంధ...
Vidaamuyarchi | అజిత్ మూవీ మేకర్స్ పట్టుదలతో లేరా..
State

Vidaamuyarchi | అజిత్ మూవీ మేకర్స్ పట్టుదలతో లేరా..

తమిళ స్టార్ హీరో అజిత్(Ajith) నుంచి వస్తున్న మూవీ విదాముయార్చి(Vidaamuyarchi). ఈ మూవీ తెలుగులో పట్టుదల అనే పేరుతో రిలీజ్ కాబోతోంది. గ్లామర్ క్వీన్ త్రిష (Trisha) హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాలవల్ల విడుదల కాలేదు. ఈనెల 6న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమైంది. కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. ఆ ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ గ్రాండ్ గా ఉన్నాయి. అజిత్ స్టైలిష్ లుక్ తో అదరగొట్టారు. ట్రైలర్ తో ఈ మూవీపై సూపర్ బజ్ ఏర్పడింది. కానీ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా సందడి మాత్రం లేదు. ఒక మూవీ రిలీజ్ కి ముందు ఆ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్లు కలిసి మూవీ ప్రమోషన్స్ ఇంటర్వ్యూ లు ఇస్తారు. అందులో హైలెట్స్ ని చెబుతూ ప్రేక్షకులు ఆ మూవీ ఎందుకు చూడాలో, అందులో ఏముందో చెప్పి వారిలో మూవీ చూడాలనే ఆసక్తిని కలిగిస్తారు...
Monalisa | తేనె కళ్ళ సుందరి ఆసక్తికర పోస్ట్…..
Cinema

Monalisa | తేనె కళ్ళ సుందరి ఆసక్తికర పోస్ట్…..

Prayagraj Monalisa : ఇప్పుడున్న సోషల్ మీడియా పుణ్యమా అని ఎప్పుడు ఎవరు ఫేమస్ అవుతారో తెలియదు. కొందరు సామాన్యులు ఓవర్ నైట్ సెలబ్రెటీలుగా మారిపోతారు. మహా కుంభమేళాలో ఇదే జరిగింది. ఒక పూసలమ్ముకునే సామాన్యురాలిని సెలబ్రెటీ చేసింది. ఒక్క వీడియోతో సోషల్ మీడియా (Social Media ) ను షేక్ చేసింది. ఆమె తేనె కల్లె ఆమెకు లక్షలాది మందిని ఫ్యాన్స్ ని తెచ్చిపెట్టి ఆమె జీవితాన్నే మార్చేసింది . ఉత్తరప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మోనాలిసా బోస్లే (Monalisa) కుటుంబం పూసలమ్ముకొని జీవనం సాగిస్తారు.అమ్మ నాన్న లకు సాయంగా మహాకుంభమేళా (Maha Kumbh 2025) కు వచ్చిన ఈ అమ్మాయి పూసలమ్ముకుంటుండగా కొందరు ఆమెని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది తన తేనే కళ్ళకు చాలామంది ఫిదా అయిపోయి వీడియో వైరల్ చేశారు. ఆ వీడియో కాస్త బాలీవుడ్ (Bollywood) దర్శకుడు కంట్లో పడింది. తను ఏకంగా తాను తీయబోయే సినిమాలో నటింప చేస్త...
Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప‌థ‌కంలో అనర్హుల గుర్తింపు షురూ..
State

Indiramma Atmiya Bharosa : ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప‌థ‌కంలో అనర్హుల గుర్తింపు షురూ..

Indiramma Atmiya Bharosa Scheme : రాష్ట్ర ప్రభుత్వం వ్య‌వ‌సాయ రైతు కూలీల కోసం ప్ర‌త్యేకంగా ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన విషయం తెలిసిందే.. ఈ స్కీమ్‌ కింద రైతు కూలీల‌కు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయాన్ని రెండు విడ‌త‌లుగా అందించనుంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి ఆన్‌లైన్‌లో వివ‌రాల న‌మోదుకు ఇప్ప‌టికే గ‌డువు పూర్త‌యింది. గ్రామ సభలు, మండల కార్యాలయాల్లో నాలుగు రోజులపాటు దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,24,487 కొత్త ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి దాదాపు సుమారు 6 లక్షల మందిని లబ్ధిదారులను ఎంపిక చేసింది. కొత్తగా వ‌చ్చిన 2,24,487 అప్లికేష‌న్ల‌లో 19,193 ద‌ర‌ఖాస్తుల‌ను ఆమోదించారు. 1,44,784 ద‌ర‌ఖాస్తులు తిర‌స్క‌ర‌ణ‌కు గురయ్య‌యాయి. మరో 59,542 దరఖాస్తుల‌ను పెండింగ్‌లో పెట్టారు. ఇందిరమ్మ...
error: Content is protected !!