Sarkar Live

Privacy Policy

మహిళా లోకానికి శుభవార్త.. గ్రామాల్లో ‘ఇందిరా మహిళా శక్తి’ భవనాలు! – Women Shakti Buildings
State

మహిళా లోకానికి శుభవార్త.. గ్రామాల్లో ‘ఇందిరా మహిళా శక్తి’ భవనాలు! – Women Shakti Buildings

8193 స్థలాల గుర్తింపు, 6261 భవనాలకు అనుమతులు, 5017కు అంచనాలు సిద్ధం యాదాద్రి భువనగిరి జిల్లా, సర్వేపల్లి గ్రామంలో తొలి భవనం ప్రారంభం Women Shakti Buildings | తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన 'ఇందిరా మహిళా శక్తి' పథకం క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలను ఇస్తోంది. మహిళా సంఘాల (VO) కోసం గ్రామాల్లో ప్రత్యేక భవనాల నిర్మాణం ఇప్పుడు యజ్ఞంలా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే వేల సంఖ్యలో స్థలాలను గుర్తించి, పనులను వేగవంతం చేశారు. అంశంప్రస్తుత పరిస్థితిమొత్తం గ్రామ పంచాయతీలు12,728గుర్తించిన స్థలాలు8,193కలెక్టర్ల నుంచి అనుమతులు6,261సిద్ధమైన అంచనాలు (Estimates)5,017 ప్రతి గ్రామ పంచాయతీలో మహిళా భవనాల నిర్మాణానికి కనీసం 200 గజాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాల‌తో 12,728 గ్రామ పంచాయతీలు ఉండగా...
రెవెన్యూ శాఖలో విప్లవం.. రేపటి నుంచే ‘భూభారతి’ షురూ! ఇంటి నుంచే భూ సేవలు.. – Bhu Bharati Portal
State, Hyderabad

రెవెన్యూ శాఖలో విప్లవం.. రేపటి నుంచే ‘భూభారతి’ షురూ! ఇంటి నుంచే భూ సేవలు.. – Bhu Bharati Portal

Highlightsఒకే గొడుగు కిందకు మూడు విభాగాలుBhu Bharati Portal ప్రాజెక్ట్ అమలు కానున్న 5 మండలాలు ఇవే:భూభారతి పోర్టల్ (Bhu Bharati Portal) ప్రత్యేకతలు:సర్వే ప్రక్రియ సాగుతుందిలా.. ఒకే గొడుగు కిందకు మూడు విభాగాలు Bhu Bharati Portal Pilot Launch | తెలంగాణ రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రూపొందించిన 'భూభారతి' (Bhu Bharati) పోర్టల్‌ను రేపటి నుంచి (ఏప్రిల్ 2) ప్రయోగాత్మకంగా ఐదు మండలాల్లో ప్రారంభించబోతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) వెల్లడించారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులకు పారదర్శకమైన, సులభతరమైన సేవలు అందించడమే లక్ష్యంగా ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను సమన్వయం చ...
వరంగల్ పోలీసుల చేతికి చిక్కిన తమిళనాడు ముఠా: 15 లక్షల సొత్తు స్వాధీనం
Crime

వరంగల్ పోలీసుల చేతికి చిక్కిన తమిళనాడు ముఠా: 15 లక్షల సొత్తు స్వాధీనం

వరంగల్‌లో వరుస గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన ఇద్దరు నిందితులను సిసిఎస్ మరియు హన్మకొండ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ​నిందితులు: కళ్యాణ సుందరం (30), సెల్వరాజ్ (28). (మధురై, తమిళనాడు). ​స్వాధీనం చేసుకున్న సొత్తు..  95 గ్రాముల బంగారు ఆభరణాలు (విలువ 15.20 లక్షల రూపాయలు). ​ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లు. ​కేసులు: వరంగల్, హన్మకొండ, సుబేదారి, కెయుసి మరియు కర్నూల్‌లో కలిపి మొత్తం 5 చైన్ స్నాచింగ్‌లు. ​చోరీల తీరు.. ​జల్సాలకు అలవాటు పడి, గంజాయి మత్తులో సులభంగా డబ్బు సంపాదించాలని ఈ ముఠా నిర్ణయించుకుంది. వీరు ముందుగా ఒక బైక్‌ను దొంగిలించి, దానిపై తిరుగుతూ ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసులను తెంచుకెళ్లేవారు. ఆధునిక టెక్నాలజీ సాయంతో నిందితులను గుర్తించిన పోలీసులు, వారు మళ్ళీ దొంగతనానికి వరంగల్ వచ్చిన సమయంలో పక్కా ప్లాన్‌తో పట్టుకున్న...
పరకాల ప్రజల మనసు గెలిచిన ‘అజాతశత్రువు’.. ఆయన వ్యూహం ఏంటి? – Revuri Prakash Reddy
Special Stories

పరకాల ప్రజల మనసు గెలిచిన ‘అజాతశత్రువు’.. ఆయన వ్యూహం ఏంటి? – Revuri Prakash Reddy

Revuri Prakash Reddy News | రాజకీయాల్లో హుందాతనం, మాటలో స్పష్టత, చేతల్లో నిబద్ధత కలగలిసిన వ్యక్తిత్వం ఆయనది. పార్టీలకు అతీతంగా అందరివాడిగా పేరు తెచ్చుకున్న నాయకుడు, పరకాల నియోజకవర్గ ప్రస్తుత శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. "వివాదరహితుడు.. విజ్ఞానశీలి" అనే ముద్రతో ఆయన సాగిస్తున్న రాజకీయ ప్రయాణంపై ఒక ప్రత్యేక విశ్లేషణ. ​అనుభవజ్ఞుడైన వ్యూహకర్త…(The Chanakya of Politics) ​రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ నిలకడగా ఉండటం చాలా కష్టం. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నేత. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకోవడంలో ఆయనను "రాజకీయ చాణక్యుడు" అని పిలుస్తారు. సంక్లిష్టమైన సమస్యలను కూడా చాలా చాకచక్యంగా పరిష్కరించడం ఆయన శైలి. వివాదరహితుడు.. పార్టీలకు అతీతుడు.. ​నేటి రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ రేవూరి గారు ఎప్పుడూ వ్యక్తిగత దూషణలకు వెళ్లరు. ప్రత్యర...
Mining mafia |మైనింగ్ శాఖ నిబంధనలకు తూట్లు
Special Stories

Mining mafia |మైనింగ్ శాఖ నిబంధనలకు తూట్లు

ఈ సీ లేకుండానే గ్రానైట్, స్టోన్ క్రషర్ ల నిర్వహణ హన్మకొండ జిల్లాలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా! అధికారుల పాత్రపై అనుమానాలు?​జిల్లాలో మైనింగ్ మాఫియా (Mining mafia) ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. పర్యావరణ అనుమతులు (EC) గాలికి వదిలేసి, నిబంధనలను తుంగలో తొక్కుతూ గ్రానైట్ క్వారీలు, స్టోన్ క్రషర్లు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నా.. గనులు, భూగర్భ శాఖ అధికారులు మాత్రం కళ్లున్నా చూడని కబోదుల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ​పర్యావరణ అనుమతులు లేవు.. నిబంధనలు అసలే పాటించరు ​సాధారణంగా ఏదైనా గ్రానైట్ క్వారీ లేదా స్టోన్ క్రషర్ నిర్వహించాలంటే పర్యావరణ శాఖ నుంచి ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ (EC) తప్పనిసరి. కానీ, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ అనుమతులు లేకుండానే మైనింగ్ సాగుతోంది. నిబంధనల ప్రకారం ఈ సి లేకుంటే క్వారీ...
error: Content is protected !!