Sarkar Live

Privacy Policy

Warangal | ప్ర‌మాదం జ‌రిగితే గానీ స్పందించ‌రా?
State, warangal

Warangal | ప్ర‌మాదం జ‌రిగితే గానీ స్పందించ‌రా?

నెలలుగా రహదారి మరమ్మతులు లేక తీవ్ర ఇబ్బందులు స్కూల్ బస్సులు, భారీ వాహనాలు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం Warangal | వ‌రంగ‌ల్ 15వ డివిజ‌న్ ప‌రిధిలోని ప్ర‌గ‌తి ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియా (Pragathi Industrial Area) నుంచి రెడ్డిపాలెం (Reddypalem) వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంస‌మై నెల‌లు గ‌డుస్తున్నా ప‌ట్టించుకున్న నాథుడే క‌రువ‌య్యారు. లోతైన గుంత‌లు ప‌డి రాళ్లు బుర‌ద‌తో నిండిపోయి ఉండ‌డంతో ఎప్పుడు ఏ ప్ర‌మాదం జ‌రుగుతుందోన‌ని స్థానికులు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే ఇదే రోడ్డు నుంచి రెండు ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు చెందిన సుమారు 25 స్కూల్ బ‌స్సులు విద్యార్థుల‌తో నిత్యం రాక‌పోక‌లు సాగిస్తుంటాయి. కీర్తిన‌గ‌ర్, గొర్రెకుంట, లేబ‌ర్ కాల‌నీ ప్రాంతాల నుంచి ప‌లువురు త‌మ పిల్ల‌ల‌ను ద్విచ‌క్ర‌వాహనాల‌పై పిల్ల‌ల‌ను ఇదే రోడ్డు మీదుగా తీసుకెళ్తుంటారు. భారీ వాహ‌నాల‌తో నిత్యం రద్దీ.. అలాగే ప‌త్తి, మిర్చి, ఇత‌ర వ్య‌...
Student Suicide | పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య కలకలం..
Crime

Student Suicide | పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య కలకలం..

Student Suicide in Hanmakonda | హనుమకొండ జిల్లా వంగర ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య (Student Suicide) ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్‌కు చెందిన ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిని వనం వర్షిత శుక్రవారం హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. దీపావళి సెలవుల అనంత‌రం అక్టోబర్ 23న పాఠశాలకు తిరిగివచ్చిన వర్షిత, మరుసటి రోజు ఉదయం తన యూనిఫాం చున్నీతో ఉరి వేసుకున్నది. విగ‌త జీవిగా ఉన్న వ‌ర్షిత‌ను గమనించిన తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అక్క‌డికి చేరుకొని మృతదేహాన్ని హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న డీఈఓ వాసంతి పాఠశాలను సందర్శించి విచారణ చేప‌ట్టారు. స్నేహితుల ప్రకారం, వర్షిత చదువులో ప్రతిభావంతురాలు. క్లాస్ లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, అందరితో కలిసిమెలిసి ఉండేది. ...
జీఎస్టీ 2.0: నవంబర్‌ 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ – చిన్న వ్యాపారాలకు భారీ ఊరట! – New GST Registration System
Business

జీఎస్టీ 2.0: నవంబర్‌ 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ – చిన్న వ్యాపారాలకు భారీ ఊరట! – New GST Registration System

New GST Registration System | నవంబర్ 1, 2025 నుండి కొత్త GST రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రారంభిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రకటించారు. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయాల‌ని కేంద్రం నిర్ణ‌యించిన‌ట్లు పేర్కొన్నారు. కొత్త వ్యవస్థ కింద, తక్కువ-రిస్క్‌గా గుర్తించబడిన దరఖాస్తుదారులు, నెలవారీ అవుట్‌పుట్ పన్ను బాధ్యత రూ. 2.5 లక్షల కంటే తక్కువ ఉన్నవారు సహా, మూడు పని దినాలలోపు ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ ఆమోదాలను పొందుతారు. ఈ మార్పు దాదాపు 96 శాతం కొత్త దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని, జాప్యాలను తగ్గిస్తుందని, సమ్మతి భారాలను తగ్గిస్తుందని భావిస్తున్నారు.ఈ సంస్కరణ విస్తృతమైన GST 2.0 చొరవలో భాగం, ఇందులో 5 శాతం మరియు 18 శాతం హేతుబద్ధమైన రెండు-స్లాబ్ పన్ను నిర్మాణం, లగ్జరీ, ప‌లు హానిక‌ర‌మైన‌ వస్తువులకు 40 శాతం రేటు కూడా...
Kurnool Accident |  25 మందికి కార‌ణ‌మైన ఘోర దుర్ఘ‌ట‌న ఎలా జ‌రిగింది.?
Crime

Kurnool Accident | 25 మందికి కార‌ణ‌మైన ఘోర దుర్ఘ‌ట‌న ఎలా జ‌రిగింది.?

Kurnool Bus Fire Accident | కర్నూలు జిల్లా చిన్న టేకూరు గ్రామ‌ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోవ‌డం అంద‌రినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్‌ ప్రైవేట్‌ వోల్వో బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. పోలీసుల సమాచారం ప్రకారం, బస్సులో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు పిల్లలు సహా మొత్తం 23 మంది సుక్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. మిగతా ప్రయాణికులు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఏమ‌న్నారు? ఈ ప్రమాదం రాత్రి 2.45 నుంచి 3 గంటల మధ్య జరిగింద‌ని, ఓ బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడంతో ఇంధన మూత తెరుచుకొని నిప్పురవ్వలు తగిలి మంటలు చెలరేగాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్ల‌డించారు.“...
KCR | హైదరాబాద్ ప్రజలకు కఠిన పరీక్ష
State

KCR | హైదరాబాద్ ప్రజలకు కఠిన పరీక్ష

కాంగ్రెస్‌ రౌడీ షీటర్‌కు టికెట్‌ ఇచ్చింది: మాజీ సీఎం కేసీఆర్‌ తీవ్ర విమర్శలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో అధికార‌ కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీ షీటర్‌గా పేరుగాంచిన వ్యక్తికి టికెట్ ఇచ్చిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ ప్రజల విజ్ఞత, తెలివితేటలకు ఈ ఎన్నిక కఠిన పరీక్షగా నిలుస్తుందని అన్నారు. విజ్ఞులైన ఓటర్లు రౌడీ షీటర్ కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థిని ఓడించి కాంగ్రెస్‌ పార్టీకి గుణ‌పాఠం చెప్పాల‌ని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని కేసీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ వచ్చాక మాయమయ్యాయని అన్నారు. “కాంగ్రెస్ దుష్టపాలనను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంద...
error: Content is protected !!