- వివరణ ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ ను ఆదేశించిన జిల్లా రిజిస్ట్రార్
- విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్న జిల్లా రిజిస్ట్రార్ ఫణిoదర్
ఆ సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar) పై వేటు పడనుందా? నిబంధనలు కు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదా? అత్యాశకు పోతే అసలుకే ఎసరు వచ్చిందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. “సర్కార్” వెబ్ సైట్ వెలువరించిన “నాలుగు రిజిస్ట్రేషన్ లు, నాలుగు లక్షలు” అనే కథనం స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖలో తీవ్ర దుమారం రేపింది.సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ ను ఆ నాలుగు రిజిస్ట్రేషన్ లపై తక్షణమే వివరణ ఇవ్వాలని వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ ఫణిoదర్ ఆదేశాలు జారీ చేశారు
అసలేంజరిగింది..?
హన్మకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయం (Hanmakonda)లో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ (Joint Sub Registrar) గా విధులు నిర్వహిస్తున్న ఆనంద్ నవంబర్ 21 వ తేదీన హసన్ పర్తి మండలంలోని ఎల్లాపూర్ లో ఉన్న ఓ అక్రమ వెంచర్ లోని నాలుగు ప్లాట్లను (డాక్యుమెంట్ నెంబర్లు 23984/2024…23983/2024…23982/2024..23981/2024) నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఇదే విషయాన్ని “సర్కార్”వెబ్ సైట్ ప్రచురించగా సదరు సబ్ రిజిస్ట్రార్ పై జిల్లా రిజిస్ట్రార్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
వివరణ కోరాము.. విచారణ చేసి రిపోర్ట్ ను చర్యల నిమిత్తం “డి ఐ జి” కి అందజేస్తాం…
ఫణిoదర్, జిల్లా రిజిస్ట్రార్…
“సర్కార్”న్యూస్ వెబ్ సైట్ ప్రచురించిన “నాలుగు రిజిస్ట్రేషన్ లు, నాలుగు లక్షలు?” అనే కథనం పై తక్షణమే వివరణ ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ ను ఆదేశించడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్ ఆనంద్ చేసిన రిజిస్ట్రేషన్ లపై విచారణ చేసి చర్యల నిమిత్తం రిపోర్ట్ ను డి ఐ జి అందజేస్తామని అన్నారు. ఆ నాలుగు రిజిస్ట్రేషన్ లకు ఎలాంటి లింక్ డాక్యుమెంట్లు లేవని “సర్కార్” న్యూస్ వెబ్ సైట్ ప్రతినిధి సమర్పించిన ఆధారాలను చూసి “జిల్లా రిజిస్ట్రార్” చెప్పడం గమనార్హం
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..









2 Comments
[…] లో ఈ స్థాయి అక్రమ రిజిస్ట్రేషన్ లు ఏ సబ్ రిజిస్ట్రార్ కూడా చేసిన దాఖలాలు కూడా […]
[…] వైరా సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar) సస్పెన్షన్ తో మరికొంతమంది అవినీతి […]