Sarkar Live

Hyderabad | రాయదుర్గంలో చదరపు గజానికి ₹3.4 లక్షల రికార్డు ధర

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు కొత్త మైలురాయి Hyderabad Rayadurg Land Price : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌లో మరో చరిత్ర సృష్టించింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TSIIC) రాయదుర్గ్‌లో నిర్వహించిన భూవేలంలో చదరపు గజానికి ₹3,40,000 ల

Hyderabad

హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు కొత్త మైలురాయి

Hyderabad Rayadurg Land Price : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌ మార్కెట్‌లో మరో చరిత్ర సృష్టించింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TSIIC) రాయదుర్గ్‌లో నిర్వహించిన భూవేలంలో చదరపు గజానికి ₹3,40,000 ల చొప్పున భారీగా ధర పలికింది. ఈ రేటు, 2017లో నమోదైన మునుపటి రికార్డు ₹88,000 ను బద్దలు కొట్టి, నగరంలోని ప్రాపర్టీ విలువల్లో కొత్త దిశకు దూసుకుపోతోంది. ఈ వేలంలో సుమారు ఒక ఎకరం భూమి విజయవంతంగా అమ్ముడైంది.

TSIIC వైస్ చైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ.. ఈ రికార్డు స్థాయి ధరలు హైదరాబాద్ ఆర్థిక వృద్ధి, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని తెలిపారు. ‘బొటిక్ మల్టీ యూజ్’ ప్రాజెక్టులకు అనువైన ప్లాట్లు అత్యధిక డిమాండ్‌లో ఉన్నాయన్నారు. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ స‌మీపంలో ఉన్న రాయదుర్గ్‌ ప్రస్తుతం నగరంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కారిడార్లలో ఒకటి. ఇక్కడ భూములపై పెట్టుబడి పెట్టడానికి డెవలపర్లు ప్రీమియం ధరలు చెల్లిస్తూ పోటీపడుతున్నారు. ఈ విజయవంతమైన వేలం, తెలంగాణ ప్రభుత్వ పారదర్శక విధానాలు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు నాయకత్వంలోని పెట్టుబడిదారులకు అనుకూల దృక్పథానికి నిదర్శనమ‌ని కె.శ‌శాంక తెలిపారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?