Sarkar Live

‘గోల్డ్ మ్యాన్’ కాదు.. అంతా ‘రోల్డ్ గోల్డ్’: పాతబస్తీ సూర్యాభాయ్ బండారం బట్టబయలు!

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ‘గోల్డ్ మ్యాన్ (Gold Man) ‘ సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేశ్ కుమార్ అసలు రంగు బయటపడింది. ఒళ్లంతా కిలోల కొద్దీ బంగారంతో మెరిసిపోయే ఆయన.. నిజానికి ధరించింది కేవలం నకిలీ ఆభరణాలేనని ఆదాయపు పన్ను (IT)

Gold man

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ‘గోల్డ్ మ్యాన్ (Gold Man) ‘ సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేశ్ కుమార్ అసలు రంగు బయటపడింది. ఒళ్లంతా కిలోల కొద్దీ బంగారంతో మెరిసిపోయే ఆయన.. నిజానికి ధరించింది కేవలం నకిలీ ఆభరణాలేనని ఆదాయపు పన్ను (IT) శాఖ అధికారులు తేల్చారు. కొండా విజయ్ కుమార్ అనే వ్యక్తిపై జరుగుతున్న ఐటీ విచారణలో భాగంగా సూర్యాభాయ్ భాగోతం వెలుగులోకి వచ్చింది.

​ఐటీ విచారణలో తేలిన షాకింగ్ నిజాలు

​ సూర్యాభాయ్ ధరించే ఆభరణాలన్నీ రాగితో తయారు చేసి, వాటిపై పూత పూసినవని అధికారులు గుర్తించారు. 32 రకాల నకిలీ ఆభరణాలను ఆయన వాడుతున్నట్లు తేలింది.

 బయటికి కోట్లాది రూపాయల విలువైన బంగారంగా కనిపించే ఆ నగలు, వాస్తవానికి కేవలం రూ. 3 లక్షల విలువ మాత్రమే చేస్తాయని అధికారులు నిర్ధారించారు. కేవలం ఒక్క ఆభరణం మాత్రమే వెండిపై బంగారు పూతతో తయారైనట్లు గుర్తించారు.బయటికి ధనవంతుడిగా ఫోజులిచ్చే సూర్యాభాయ్‌ కి సొంత ఇల్లు కూడా లేదు. ఆయన నెలకు రూ. 20 వేలు అద్దె చెల్లిస్తూ ఒక కిరాయి ఇంట్లో నివసిస్తున్నారు.

​Gold man : ఆదాయం నామమాత్రం.. లక్ష్యం సినిమా ఛాన్సులే!

​గత ఆరేళ్లుగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయని సురేశ్ కుమార్, కేవలం 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం రూ. 4.9 లక్షలుగా చూపించారు. ఇంత తక్కువ ఆదాయం ఉండి అన్ని కిలోల బంగారం ఎలా సాధ్యమని ఆరా తీయగా అసలు విషయం ఒప్పుకున్నారు.

​”జనాల్లో పాపులారిటీ సంపాదించాలని, సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే ‘గోల్డ్ మ్యాన్’గా నకిలీ ప్రచారం చేసుకున్నాను” అని సూర్యాభాయ్ విచారణలో వెల్లడించినట్లు సమాచారం.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా   వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

Recent Posts

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?